ETV Bharat / state

ఈటీవీ భారత్ కథనానికి స్పందన.. రోడ్లపై గుంతలు పూడుస్తున్న అధికారులు

Officials Action on Guntur Roads: గుంటూరు జిల్లాలో పలకలూరు రహదారి దుస్థితిపై ఈటీవీ భారత్, ఈనాడు కథనానికి అధికారులు స్పందించారు. గుంతలు పూడ్చేందుకు చర్యలు చేపట్టారు. గుంతలను రాళ్లు, కంకర చిప్స్‌తో నింపి వాహనదారులకు ఇబ్బందులు లేకుండా తాత్కాలిక చర్యలు చేపట్టారు.

పలకలూరు రహదారి
పలకలూరు రహదారి
author img

By

Published : Jul 12, 2022, 8:46 PM IST

ETV Bharat effect: గుంటూరు నుంచి పేరెచర్ల వెళ్లే మార్గంలో పలకలూరు వద్ద రహదారి దుస్థితిపై ఈటీవీ భారత్, ఈనాడులో కథనానికి అధికారులు స్పందించారు. రహదారిపై ఉన్న భారీ గోతుల్ని హడావుడిగా పూడ్చేందుకు చర్యలు చేపట్టారు. రాళ్లు, కంకర చిప్స్​తో గుంతలను నింపారు. వాటిపై కంకర డస్ట్ పోయటం ద్వారా వాహనాలు వెళ్లేందుకు ఇబ్బందులు లేకుండా తాత్కాలిక చర్యలు చేపట్టారు. రోడ్డుని చదును చేసే పనులు కూడా నిర్వహిస్తున్నారు.

రహదారి మొత్తం కాకుండా తీవ్రంగా దెబ్బతిన్న ప్రాంతంలో మాత్రమే గుంతలు పూడుస్తున్నారు. చిన్న చిన్న గుంతలు అలాగే వదిలేశారు. మరోవైపు రహదారి దెబ్బతిన్న కారణంగా వాహనదారులు ఇబ్బందులు పడుతున్న విషయం వాస్తవమని నగరపాలక సంస్థ అధికారులు అంగీకరించారు. ఈ మేరకు కమిషనర్ చేకూరి కీర్తి ప్రకటన జారీ చేశారు. రహదారి విస్తరణ కోసం ప్రణాళికలు రూపొందించామని.. అందులో ఇళ్లు, స్థలాలు కోల్పోయే వారి నుంచి సమ్మతి రావాల్సి ఉందని ప్రకటనలో పేర్కొన్నారు. 57 మందికి గాను 38 మంది మాత్రమే సమ్మతించినట్లు వివరించారు.

నష్ట పరిహారం బాండ్లు అందించే ప్రక్రియ పూర్తయిన తర్వాత ఆ స్థలాలను రోడ్లు భవనాల శాఖకు అప్పగిస్తామని కమిషనర్ తెలిపారు. పలకలూరు వద్ద దాదాపు రెండు ఫర్లాంగుల మేర రహదారి మొత్తం గోతులతో ఉండటంతో వాహనదారులు నరకయాతన అనుభవిస్తున్నారు. మొదట్లో చిన్న గోతులే ఉన్నప్పటికీ.. మూడేళ్లుగా మరమ్మత్తులు లేకపోవటంతో అవి క్రమేణా పెరిగి భారీ గుంతలుగా మారాయి. దీంతో ఈ మార్గంలో వెళ్లే వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇప్పుడు వర్షాలు కురవటంతో ఆ గోతుల్లోకి నీరు చేరి ప్రయాణం మరింత కష్టంగా మారింది. గుంతెక్కడో తెలియక వాహనదారులు కింద పడిపోతున్నారు. ఈ దారుణ పరిస్థితులపై ఈటీవీ భారత్, ఈనాడులో కథనాలు రావటంతో అధికార యంత్రాంగం స్పందించి రహదారి మరమ్మత్తులు చేపట్టారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.