ETV Bharat / state

గుంటూరు జిల్లాలో ఘనంగా ఎన్టీఆర్ వర్ధంతి - ntr death anniversary update

గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఎన్టీఆర్ వర్థంతిని.. తెదేపా నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి.. రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు.

ntr death anniversary in guntur
గుంటూరు జిల్లాలో ఎన్టీఆర్ వర్థంతి
author img

By

Published : Jan 18, 2021, 2:20 PM IST

Updated : Jan 18, 2021, 6:01 PM IST

గుంటూరు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలో ఎన్టీఆర్ వర్థంతిని.. తెదెపా యువత, ఎన్టీఆర్ ట్రస్ట్ సంయుక్తంగా పెద్దఎత్తున నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవూరివారిపాలెం, కమ్మవారిపాలెం గ్రామాల్లో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాలను మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొని, రక్తదానం చేసిన యువతకు ధ్రువపత్రాలను అందజేశారు. తెలుగు జాతి గర్వించదగ్గ మహానీయుడు నందమూరి తారకరామారావు అనీ.. ప్రజల గుండెల్లో చిరస్మరణీయుడిగా నిలిచిపోతారని మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు అన్నారు.

గుంటూరులోని తెదేపా కార్యాలయంలో..

గుంటూరులోని తెదేపా కార్యాలయంలో నందమూరి తారక రామారావు 25వ వర్ధంతిని నిర్వహించారు. తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన ఎన్టీఆర్‌ ప్రతి ఒక్కరికి స్ఫూర్తి అని గుంటూరు పార్లమెంటరీ తెదేపా అధ్యక్షుడు తెనాలి శ్రావణ్​కుమార్ అన్నారు. ఎన్టీఆర్ చిత్ర పటానికి, విగ్రహానికి పూల మాలలు వేసి నివాళి అర్పించారు. ఉజ్వలమైన సీని జీవితాన్ని వదులుకుని ప్రజలకు సేవచేశారని కొనియాడారు. వైకాపా పరిపాలనలో అవినీతి రాజకీయం జరుగుతోందని, రెండు వర్గాల మధ్య గొడవలు పెట్టే విధానాలను కొనసాగిస్తోందని విమర్శించారు.

నరసరావుపేట తెదేపా కార్యాలయంలో..

నరసరావుపేటలోని తెదేపా కార్యాలయంలో నందమూరి తారకరామారావు వర్ధంతిని నిర్వహించారు. నరసరావుపేట పార్లమెంట్ తెదేపా అధ్యక్షుడు ఆంజనేయులు, నియోజకవర్గ తెదేపా ఇన్​ఛార్జ్​ డాక్టర్​ చదలవాడ అరవింద బాబు పాల్గొన్నారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన లెజెండరీ రక్తదాన శిబిరాన్ని జీవీ ఆంజనేయులు ప్రారంభించారు. కార్యకర్తలు, అభిమానులు పాల్గొని రక్తదానం చేశారు.

దేశంలోనే ఏపీకీ ప్రత్యేక గుర్తింపు..

ntr death anniversary in guntur
ఎన్టీఆర్ వర్ధంతి

ఏపీకీ దేశంలోనే ప్రత్యేక గుర్తింపును తెచ్చిన మహనీయుడు ఎన్టీఆర్ అని జీవీ ఆంజనేయులు అన్నారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల ప్రజలపై దాడులు పెరిగాయని ఆరోపించారు. ఎన్టీఆర్ ఆశయ సాధనకోసం నేటి యువత నడుం బిగించి పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు.
సినీ, రాజకీయ చరిత్రలో తనదైన ముద్ర వేసుకున్న మహోన్నతమైన వ్యక్తి నందమూరి తారకరామారావు అని చదలవాడ అరవింద బాబు అన్నారు. సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్లు.. రక్తదానం చేయండి ప్రాణాన్ని నిలబెట్టండి.. అన్న నినాదాలతో బతికిన మంచి వ్యక్తి ఎన్టీఆర్ అని ఆయన అభివర్ణించారు.

ఇదీ చదవండి: రూపం మనోహరం.. అభినయం అనితర సాధ్యం!

Last Updated : Jan 18, 2021, 6:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.