ETV Bharat / state

నిధుల కొరత.. పని చేయని ఉర్దూ కంప్యూటర్​ శిక్షణ కేంద్రాలు

Urdu Computer Training Centers And Libraries : ఉమ్మడి గుంటూరు జిల్లాలోని ఉర్దూ కంప్యూటర్​ శిక్షణ కేంద్రాలు, లైబ్రరీలు.. శిక్షణకు, పాఠకులకు దూరంగా ఉన్నాయి. నిధుల కొరత వాటిని చుట్టుముట్టడంతో అవి పని చేయడం లేదు. వాటి నిర్వహణకు సిబ్బంది అందుబాటులో ఉన్న.. సరిపడా నిధులు లేక సేవలు అందించ లేకపోతున్నాయి.

1
1
author img

By

Published : Mar 13, 2023, 9:56 PM IST

No Funds to Urdu Computer Training Centers : ఉర్దూ మాధ్యమ విద్యార్థులు, అభ్యర్థులు, పాఠకుల కోసం గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన కంప్యూటర్ శిక్షణ కేంద్రాలు, గ్రంథాలయాలు అడవి కాచిన వెన్నెలలాగా మిగిలిపోయాయి. కరోనా లాంటి మహమ్మారి పరిస్థితులు ఏర్పడి అంతా సద్దుమణిగిన తర్వాత కూడా ఇవి పని చేయటం లేదు. గత 14 నెలలుగా నిధుల కొరతతో శిక్షణ కేంద్రాలు ముందుకు సాగటం లేదు.

గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లోని ఉర్దూ కంప్యూటర్​ శిక్షణ కేంద్రాలు, గ్రంథాలయాల నిర్వహణకు గత 14 నెలలుగా నిధులు అందటం లేదు. ఉర్దూ భాషలో ప్రావీణ్యం సంపాదించుకుని ప్రపంచ స్థాయిలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందటానికి వీలుగా.. ఈ శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. గత ప్రభుత్వం వీటిని ఏర్పాటు చేయగా.. ఇప్పటి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని రోజులు వాటిని అలాగే కొనసాగించింది. గత ప్రభుత్వం ఏర్పాటు చేసినవే కాకుండా.. మరికొన్ని కొత్త కేంద్రాలను సైతం ఏర్పాటు చేసింది. కరోనా రాకతో వీటిని తాత్కలికంగా మూసివేశారు. తర్వాత పునః ప్రారంభించినా.. నిధుల లేమితో ఇవి సరిగా నడవటం లేదు.

కొవిడ్ ఉద్ధృతి తగ్గిన తర్వాత ఈ కేంద్రాలకు నిధులు అందటం లేదు. దీంతో వీటి నిర్వహణ సాఫీగా సాగటం లేదు. ఉర్దూ అకాడమీ పరిధిలో నరసరావుపేట, పిడుగురాళ్ల, తెనాలి, పర్చూరు, చీరాలలో కంప్యూటర్ శిక్షణ కేంద్రాలతోపాటుగా గ్రంథాలయాలున్నాయి. మంగళగిరి, చిలకలూరిపేటలో కేవలం ఉర్దూ కంప్యూటర్​ శిక్షణ కేంద్రాలను మాత్రమే ఏర్పాటు చేశారు. సత్తెనపల్లి, మేడికొండూరులో గ్రంథాలయ సేవలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో 11 కేంద్రాలు అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. ఈ కేంద్రాలలో ఇన్​స్ట్రక్టర్, లైబ్రేరియన్, అటెండర్లు విధులు నిర్వహిస్తున్నారు.

భవనాలకు అద్దెతో పాటు విద్యుత్​ బిల్లులు, దినపత్రికలు, పుస్తకాలు, తాగునీరు వంటి వసతులకు నిధులు రావాల్సి ఉంది. ఒక్కో కేంద్రం నిర్వహణకు నెలకు 10వేల రూపాయల నుంచి 20 వేల రూపాయల వరకు నిధులు అవసరమవుతున్నాయి. ఈ నిధులను ప్రభుత్వం మంజూరు చేయాల్సి ఉండగా.. 2021 నవంబర్ నుంచి ఇప్పటి వరకు దాదాపు 14 నెలల నిధులు శిక్షణ కేంద్రాలకు అందలేదు. నిధులు మంజూరు కాక వాటి నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి.

రాష్ట్ర ఉర్దూ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కంప్యూటర్ శిక్షణ కేంద్రాలలో పలు కంప్యూటర్​ కోర్సులు, ఎంఎస్​ ఆఫీస్​, హైపర్ టెక్ట్స్ మార్కప్ లాంగ్వేజ్, పోటో షాప్, సీ-లాంగ్వేజ్ వంటి అంశాలలో ఔత్సాహికులకు శిక్షణ ఇస్తున్నారు. శిక్షణ కేంద్రాలకు అందాల్సిన నిధుల గురించి పలుసార్లు ఉన్నతాధికారులకు తెలియజేశామని శిక్షకులు అంటున్నారు. ఉర్దూ విద్యార్థులు, అభ్యర్థులు ఆసక్తిగా నేర్చుకుంటున్న కంప్యూటర్ విద్య, గ్రంథాలయాలకు మళ్లీ పూర్వవైభవం తీసుకువచ్చేందుకు.. ప్రభుత్వం కృషి చేయాల్సిన అవసరం ఉందని వారు కోరుతున్నారు. ఇందుకోసం ప్రభుత్వం పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని ఔత్సాహికులు కోరుతున్నారు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.