ETV Bharat / state

నిండాముంచిన నివర్...వేల హెక్టార్లలో పంట నష్టం

author img

By

Published : Nov 27, 2020, 4:00 PM IST

Updated : Nov 28, 2020, 1:59 AM IST

నివర్ తుపాను ప్రభావంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చేతి కొచ్చిన పంట నీటిలో తేలియాడుతున్న దృశ్యాలను చూసి తల్లడిల్లుతున్నారు. వేల ఎకరాలలో గింజ బలపడే దశలో భారీ వర్షం రైతులకు కన్నీళ్లు మిగిల్చింది. కోత కోసిన వరి ఓదెలు నీళ్లలో తేలుతున్నాయి. తమను సకాలంలో ఆదుకుని నష్టపరిహారం చెల్లించాలని అన్నదాతలు కోరుతున్నారు.

నివర్ మిగిల్చిన నష్టం తీర్చేదెవరు?
నివర్ మిగిల్చిన నష్టం తీర్చేదెవరు?

నివర్ మిగిల్చిన నష్టం తీర్చేదెవరు..?

నివర్ తుపాను ప్రభావం గుంటూరు జిల్లాలో తీవ్రంగా కనిపిస్తోంది. నివర్ తుపాన్ కారణంగా పెదకాకాని మండలం వెంకటకృష్ణాపురంలో వరి పంట నేలవాలింది. దెబ్బతిన్న పంటలను జాయింట్ కలెక్టర్​, వ్యవసాయ శాఖ కమిషనర్ అరుణ్ కుమార్ పరిశీలించారు. నష్టపోయిన రైతులకు పరిహారాన్ని అందజేస్తామన్నారు. 2829 హెక్టార్లు నారుమడి, 13 వేల హెక్టార్లలో మినుము, ఐదు వేల హెక్టార్లలో పత్తి పంట నష్టం వాటిల్లింది. జిల్లా వ్యాప్తంగా లక్ష హెక్టార్లలో వరి నేల వాలినట్లు గుర్తించినట్లు అధికారులు తెలిపారు. వర్షాలు తగ్గిన వెంటనే పంట కోత ప్రయోగాలు నిర్వహించి డిసెంబర్ ఆఖరు నాటికి పూర్తిచేసి రైతులకు నష్టపరిహారం అందిస్తామన్నారు.

దెబ్బతిన్న మిరప, పత్తి, పొగాకు పంటలు

చిలకలూరిపేట ప్రాంతంలో ప్రధాన వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. కొన్ని మార్గాలలో రాకపోకలు నిలిచిపోయాయి. వాగు పరివాహక ప్రాంతంలోని పంటలు నీట మునిగాయి. గోవిందపురం, కావూరు, లింగంగుంట్ల, గణపవరం, వేలూరు తదితర గ్రామాల పరిధిలోని పత్తి, మిర్చి, పొగాకు, శనగ తదితర పంటలు దెబ్బతిన్నాయి. ఒకటి రెండు చోట్ల పాత ఇంటి గోడలు కూలిపోయాయి.

చెరువులను తలపిస్తోన్న పంటపొలాలు

పెదనందిపాడులో కురిసిన వర్షానికి మిర్చి పైరు నీట మునిగింది. వరగాని, గోగులమూడి డొంక రహదారిలో వర్షపు నీరు పొలాలోకి చేరి చెరువులను తలపిస్తున్నాయి. పత్తి పొలాలు సైతం కుళ్ళిపోతున్నాయని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. నల్లమడ వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వట్టిచెరుకూరు మండలంలో మిర్చి పైరులోకి నీరు చేరడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు వర్షం ప్రభావంతో మిర్చి దిగుబడులు పూర్తిగా తగ్గుతాయని రైతులు వాపోతున్నారు.

నివర్ మిగిల్చిన నష్టం తీర్చేదెవరు?
నివర్ మిగిల్చిన నష్టం తీర్చేదెవరు?

సత్తెనపల్లిలో ఈదురుగాలులకు కూలిన చెట్లు

సత్తెనపల్లిలో ఈదురు గాలులుతో రహదారిపైన చెట్లు కూలి పోయాయి. పిడుగురాళ్ల - సత్తెనపల్లి మధ్య వాహనాల రాకపోకలకు గంట సేపు అంతరాయం ఏర్పడింది. స్పందించిన అధికారులు చెట్లను తొలగించి రాకపోకలకు ఇబ్బంది లేకుండా చేశారు. నరసరావుపేట, రొంపిచర్ల మండలాల్లో వాగులు పొంగి వర్షపునీరు రహదారులపైకి చేరింది. వాహనదారుల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఆ ప్రాంతాన్ని నరసరావుపేట తెదేపా ఇన్​ఛార్జ్​ చదలవాడ అరవింద బాబు, స్థానిక ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సందర్శించి ఇలాంటి పరిస్థితి మరోసారి ఎదురు కాకుండా మున్సిపల్, ఆర్ అండ్ బి అధికారులకు శాశ్వత పరిష్కార చర్యలు చేపట్టాలని సూచించారు.

రహదారులపై ప్రవహిస్తున్న వర్షం నీరు
రహదారులపై ప్రవహిస్తున్న వర్షం నీరు

జిల్లాలో వర్షపాతం నమోదు వివరాలు

గడచిన 24 గంటల్లో జిల్లాలో సగటున 73.8 మిల్లీ మీటర్లు వర్షపాతం నమోదైంది. దుగ్గిరాల, బాపట్లలో 126.4, నూజెండ్ల, చిలకలూరిపేటలో 118.6, వేమూరులో 108.6, కాకుమానులో 102.4, రేపల్లెలో 100.2, భట్టిప్రోలులో 99, ప్రత్తిపాడులో 98.4, కొల్లూరులో 97, చుండూరులో 96.8, నగరంలో 96.4, మంగళగిరిలో 92.6, అమృతలూరులో 91.4, కొల్లిపరలో 90.6, వట్టిచెరుకూరులో 85.6, నిజాంపట్నంలో 84.4, పెదనందిపాడులో 84.4, చెరుకుపల్లిలో 84, కర్లపాలెంలో 83.6, పెదకాకానిలో 80.6, పిట్టలవానిపాలెంలో 79.6, చేబ్రోలులో 79.4, పొన్నూరులో 78.6, యడ్లపాడులో 77.4, తాడికొండలో 77, వినుకొండలో 76.6, శావల్యాపురంలో 76.4, నాదెండ్లలో 76.2, నకరికల్లులో 76.2, బొల్లాపల్లిలో 75.2, నరసరావుపేటలో 73.6, రొంపిచర్లలో 72.6, గుంటూరులో 72, ఈపూరులో 69.2, తాడేపల్లిలో 66.6, అమరావతిలో 66.4, ఫిరంగిపురంలో 61.8, మేడికొండూరులో 60.8, సత్తెనపల్లిలో 60.6, బెల్లంకొండలో 60.4, పెదకూరపాడులో 59.4, దాచేపల్లిలో 58.4, మాచవరంలో 54.2, తెనాలిలో 51.4, క్రోసూరులో 51.2, తుళ్లూరులో 50.6, కారంపూడిలో 46.4, పిడుగురాళ్లలో 42.2, మాచర్లలో 41.8, అచ్చంపేటలో 39.4, దుర్గిలో 38.2, గురజాలలో 37.8, రెంటచింతలలో 37.2, వెల్దుర్తిలో 35.2, ముప్పాళ్లలో 34.4, రాజుపాలెంలో 29 మిల్లీ మీటర్లు వర్షపాతం నమోదైంది.

అధికారులు అప్రమత్తంగా ఉండాలి

తుపాన్ తీవ్రత అధికంగా ఉన్న కారణంగా సహాయక చర్యలు చేపట్టేందుకు అధికారులు మండల హెడ్ క్వార్టర్స్​లో సిద్ధంగా ఉండాలని గురజాల ఆర్డీవో పార్థసారధి ఆదేశించారు. తుపాన్ పరిస్థితిని ఎప్పటికపుడు సమీక్షిస్తున్నామన్నారు. డివిజన్ పరిధిలో సహాయక చర్యలు చేపట్టేందుకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. రానున్న 24 గంటలు జిల్లాలో మోస్తారు వర్షాలు కురిసే అవకాశముందన్న వాతావరణశాఖ సూచనలతో అధికారులు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

ఇవీ చదవండి

గుంటూరులో నీట మునిగిన వరి పొలాలు... ఆవేదనలో రైతులు

Last Updated : Nov 28, 2020, 1:59 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.