గుంటూరు జిల్లా మంగళగిరి శాసనసభ్యులు ఆళ్ల రామకృష్ణా రెడ్డి గత ఎన్నికల్లో ఇచ్చిన హామీకి కట్టుబడి ఉండాలని నిడమర్రు గ్రామస్థులు తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. నిడమర్రు చెరువు కట్టపై వందేళ్లుగా ఇళ్లు నిర్మించుకుని ఉంటున్నామని.. ఇప్పుడు అకస్మాత్తుగా వాటిని తొలగించాలంటూ అధికారులు ఆదేశించారని బాధితులు వాపోయారు. గత ఎన్నికల ప్రచారంలో ఇళ్లు తొలగించమని ఎమ్మెల్యే ఆళ్ల హామీ ఇచ్చారని.. బాధితులు చెప్పారు.
ఇళ్లు కోల్పోతున్న వారికి మద్దతుగా తెదేపా, వామపక్షనేతలు తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. లోకేశ్ అధికారంలోకి వస్తే ఇళ్లు తొలగిస్తారని తప్పుడు ప్రచారంతో లబ్ధి పొందిన ఆర్కే.. ఇప్పుడు ఏం చెబుతారని ప్రశ్నించారు.
ఇదీ చదవండీ... Fake challans: నకిలీ ఈ చలానాల కేసులో ప్రధాన నిందితుడు అరెస్ట్