గుంటూరు జిల్లా నరసరావుపేట, రొంపిచర్ల మండలాల్లోని విద్యుత్ అధికారులతో ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సమీక్షా సమావేశం జరిపారు. గ్రామాల్లోని రైతులకు, ప్రజలకు విద్యుత్ సమస్యలు రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రజలు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేసినా అధికారులు స్పందించాలని చెప్పారు. గ్రామ సచివాలయాల్లో, పట్టణాల్లో ఉన్న జేఎల్ఎంలతో ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు సమావేశమవ్వాలని కోరారు.
రొంపిచర్ల మండలంలో విద్యుత్ సమస్యలు ఎక్కువగా ఉన్నట్లు ప్రజలు చెప్పారని ఎమ్మెల్యే అన్నారు. అధికారులు పట్టించుకోవటం లేదని జనం నుంచి విమర్శలు రాకుండా చూసుకోవాలని ఆయన చెప్పారు. కరెంట్ సమస్యలకు అధికారులు స్పందించకపోతే ప్రభుత్వ వైఫల్యమని ఆరోపించడం సరికాదన్నారు. నరసరావుపేట నియోజకవర్గంలో 560 కరెంట్ పోల్స్ అవసరమని అధికారులు చెప్పారని.. ఈ నెలాఖరులోగా 200 పోల్స్ అందిస్తామని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: ప్రాథమిక దర్యాప్తు చేయకుండా అరెస్ట్ చేస్తారా..?- హైకోర్టు