Nara Lokesh on roads issue: రాజధాని అమరావతిలో రహదారుల దుస్థితిపై దృష్టి సారించాలని ఆర్అండ్బీ ముఖ్య కార్యదర్శికి తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ రాసారు. ఎస్‌ఆర్‌ఎం విశ్వవిద్యాలయానికి వెళ్లే రహదారి మరీ అధ్వానంగా ఉండటంతో విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నందున తక్షణం మరమ్మతులు చేయాలని డిమాండ్ చేశారు. సామాజిక, సాంస్కృతిక మార్పులకు రహదారుల అభివృద్ధి ఎంతో కీలకమని లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రంలో గత 3ఏళ్లుగా రోడ్ల పరిస్థితి మరీ అధ్వానంగా ఉందని ధ్వజమెత్తారు. రాజధాని ప్రాంతమైన అమరావతిలోని ఎస్‌ఆర్‌ఎం యూనివర్శిటీకి వెళ్లే రహదారుల దారుణమైన పరిస్థితి గురించి ప్రత్యేకంగా ఆర్.అండ్.బీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నట్లు లేఖలో పేర్కొన్నారు.
2017లో స్థాపించిన యూనివర్సిటీకి వెళ్లే రోడ్ల దయనీయ స్థితి ఆవేదన కలిగిస్తోందన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు రహదారుల దుస్థితిపై తనకు అనేక ఫిర్యాదులు అందచేశారని.. ఆ మార్గంలో రవాణా పెను సవాలుగా మారిందని, వారంతా ఆందోళన చెందుతున్నారన్నారు. తరచూ ప్రమాదాలు, వాహనాలు దెబ్బతినడం వంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని వెల్లడించారు. విద్యార్థులు, బోధనా సిబ్బంది అమూల్యమైన సమయం వృధా అవుతోందన్నారు. తక్షణమే రోడ్లకు మరమ్మతులు చేయించాలని కోరారు.
ఇవీ చదవండి: