రాజ్యాంగం కల్పించిన సర్పంచ్ అధికారాలను బలవంతంగా లాక్కునేందుకు యత్నించిన అధికారులు... తప్పక మూల్యం చెల్లించుకుంటారని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ అన్నారు. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం గొడవర్రులో నారా లోకేష్ పర్యటించారు. కొవిడ్ రెండో దశలో గొడవర్రు గ్రామస్థులకు లోకేశ్ అండగా నిలిచారు. కరోనాతో బాధపడుతున్న 61 మందికి జూమ్ ద్వారా అమెరికా వైద్యులతో వైద్య సహాయం అందించారు.
బాధితుల ఇళ్లకు వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మూడో దశ ముప్పు పొంచి ఉన్నందున మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని లోకేశ్ గ్రామస్థులకు సూచించారు. వైకాపా తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై పోరాటం చేస్తామని తేల్చిచెప్పారు. పేదలకు ప్రభుత్వ ఖర్చుతోనే ఇల్లు నిర్మించి ఇవ్వాలని లోకేశ్ డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:
AP-TG WATER ISSUE: కృష్ణా జలాలపై... మరోసారి సుప్రీంకు రాష్ట్ర ప్రభుత్వం!