ETV Bharat / state

'కుటుంబ కలహాలతోనే సోదరుడిని హత్య చేశాడు'

author img

By

Published : Oct 17, 2020, 1:19 AM IST

ఈనెల 14 న జరిగిన హత్య కేసును తెనాలి పోలీసులు ఛేదించారు. కుటుంబ కలహాలతోనే సోదరుడిని.. రాముమహేష్ కత్తితో పొడిచి హత్య చేసినట్లు తెనాలి సీఐ అశోక్ కుమార్ తెలిపారు. నిందితుడి వద్ద నుంచి హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకుని కోర్టులో హాజరపరిచినట్లు వెల్లడించారు.

murder case in guntur district
murder case in guntur district

గుంటూరు జిల్లా తెనాలి మండలం.. కొలకలూరు గ్రామంలో ఈ నెల 14వ తేదీన సాయంత్రం 5.30 నిమిషాలకు తిరుమలశెట్టి నాగరాజు అనే వ్యక్తి హత్యకు గురైనట్లు తెనాలి పోలీస్ స్టేషన్​లో కేసు నమోదు అయింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు..శుక్రవారం హత్యకు కారణమైన రాము మహేష్ ను తెనాలి మండలం ఆటో నగర్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు రామ్ మహేష్ ఐదోవ తరగతి వరకు చదివి మధ్యలో ఆపేసి.. ప్లంబర్, లారీ క్లీనర్​గా పనులు చేసుకుంటున్నాడు.

ఇదే సమయంలో చెడు వ్యసనాలకు బానిసై తరుచూ మద్యం సేవిస్తూ.. గొడవలు పడుతుండేవాడు. అతని పెద్దమ్మ కొడుకు తిరుమలశెట్టి నాగరాజు, ఇంటి పక్కన వారికి, పనిచేసే దగ్గర లేనిపోని మాటలు చెప్పి తనను తప్పుడు వ్యక్తిగా చిత్రీకరిస్తున్నాడని భావించాడు మహేష్. అందుకు పగ పెంచుకున్న రామ్ మహేష్ మద్యం సేవించి ఈనెల 14న కత్తితో విచక్షణరహితంగా పొడిచి హత్య చేశాడని సీఐ అశోక్ కుమార్ తెలిపారు. కేవలం నాగరాజు మాటలు విని తన భార్య తనను వదిలేసి వెళ్లిందని, మేస్త్రి కూడా పనిలో పెట్టుకోవడం లేదనే అక్కసు తోనే నాగరాజును హతమార్చినట్లు నిందితుడు రామ్ మహేష్ అంగీకరించినట్లు పోలీసులు వివరించారు.

ఇదీ చదవండి: రాష్ట్రంలో కొత్తగా 3,967 కరోనా కేసులు, 25 మరణాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.