Municipal workers strike continued for 13th day: న్యాయమైన డిమాండ్లను నెరవేర్చే వరకూ తగ్గేదే లేదంటూ రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు హోరెత్తించారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో వినూత్నంగా నిరసన తెలిపారు. కార్మికులు వేప మండలు కట్టుకొని ర్యాలీ నిర్వహించారు. తర్వాత రహదారిపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కనీస వేతనం అమలు చేయాలని వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్ లో మానవహారంగా ఏర్పడి నిరసన తెలిపారు. సమ్మెలో భాగంగా కార్మికులు విధులకు హాజరుకాకపోవడంతో పట్టణంలో చెత్త పేరుకుపోయింది. ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని అనంతపురం జిల్లా గుత్తిలో ఆందోళన చేశారు. గుత్తి పట్టణంలో ఎక్కడ చెత్త అక్కడే నిలిచిపోయింది. ఒంగోలు మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. 13 రోజులుగా సమ్మె చేస్తుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కార్మికులు మండిపడ్డారు.
విజయవాడ ధర్నాచౌక్‌లో సమ్మె కొనసాగిస్తున్న మున్సిపల్ కార్మికులకు సీపీఎం నేత బి.వి.రాఘవులు సంఘీభావం తెలిపారు. బాపట్ల జిల్లా అద్దంకిలో దీక్షా శిబిరాన్ని ఎమ్మెల్యే గొట్టిపాటి రవి సందర్శించి కార్మికులకు సంఘీభావం తెలిపారు. కార్మికుల ఆందోళలను అణచివేసేందుకు ప్రభుత్వం కొత్త జీవోలు తీసుకురావడం సరికాదన్నారు. ప్రభుత్వం చర్యల వల్ల ఉద్యమం మరింత ఉద్ధృతంగా మారుతుందే తప్పా, ఉద్యోగులు శాంతించే పరిస్థితులు ఉండవని కార్మిక నేతలు వెల్లడించారు.
'సమస్యలపై మేము రోడ్డెక్కాం - పట్టించుకోకుండా సీఎం జగన్ ఆడుకుంటున్నారు'
సమస్యలు పరిష్కరించేలా ప్రభుత్వం మనసు మారాలంటూ ఒంగోలు కలెక్టరేట్ వద్ద కార్మికుల ప్రార్ధనలు చేశారు. కనిగిరిలో చెత్త తరలిస్తున్న వాహనాలను కార్మికులు అడ్డుకున్నారు. 13 రోజులుగా సమ్మె కొనసాగిస్తుంటే ప్రభుత్వం పట్టించుకోవటం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మనసు మార్చుకొని తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీలను మాత్రమే అడుగుతున్నామని తెలిపారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో కార్మికులు పొర్లు దండాలు పెడుతూ నిరసన తెలిపారు.
Workers Agitation: హామీలు నెరవేర్చాలంటూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఇంటి ముట్టడికి యత్నం
అనంతపురం, గుత్తిలో కార్మికులు సర్వమత ప్రార్థనలు చేస్తూ నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాయదుర్గంలో మున్సిపల్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. పాతబస్టాండ్ వద్ద మానవహారం నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయు, సీపీఎం, సీపీఐ నాయకులు పాల్గొని మున్సిపల్ కార్మికులకు తమ మద్దతు తెలిపారు.
వైఎస్సార్ కడప జిల్లా బద్వేలులో మానవహారంగా నిలబడి నిరసన తెలిపారు. కార్మికుల సమ్మెతో పట్టణంలో వ్యర్థాలు పేరుకుపోయి దుర్గంధం వెదజల్లుతోంది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో మున్సిపల్ కార్మికులు శరీరానికి వేప మండలు కట్టుకుని ర్యాలీ చేశారు. సోమప్ప కూడలిలో రహదారిపై బైఠాయించి పనికి తగ్గ వేతనం ఇవ్వాలని నినాదాలు చేశారు. సీఎం జగన్ ఇప్పటికైనా ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
Poisonous fevers in Guntur due to Bad Drainage system గుంటూరులో విజృంభిస్తున్న విష జ్వరాలు.. డ్రైనేజి నిర్వాహణ లేమితోనే వ్యాధులంటున్న బాధితులు