Municipal Outsourcing Employees Protest: అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో ఒప్పంద, పొరుగు సేవల కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేస్తానని మాటిచ్చిన సీఎం జగన్... ప్రభుత్వం ఏర్పాటు కాగానే మడమ తిప్పేశారని పారిశుద్ధ్య కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ ఒప్పంద, పొరుగు సేవల కార్మికుల సమస్యల్ని పరిష్కరించాని డిమాండ్ చేస్తూ.. రాష్ట్రవ్యాప్తంగా వివిధ కలెక్టరేట్ల వద్ద ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. జీవో నెంబర్ 7ను అమలు చేయకుండా క్లాప్ ఆటో డ్రైవర్లను ప్రభుత్వం శ్రమ దోపిడీ చేస్తోందని కార్మికులు తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వంటావార్పు చేపట్టారు. న్యాయబద్ధమైన సమస్యల సాధన కోసం ఈ నెల 27, 28న చలో విజయవాడ చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం స్పందించకుంటే సమ్మెకు దిగుతామని హెచ్చరించారు.
గత ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను సీఎం జగన్ నెరవేర్చాలని మున్సిపల్ ఒప్పంద, పొరుగు సేవల కార్మికులు డిమాండ్ చేశారు. గుంటూరు కలెక్టర్ కార్యాలయం ఎదుట వంటా-వార్పు కార్యక్రమంలో మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు. మున్సిపల్ ఒప్పంద, పొరుగు సేవల కార్మికులను ఉద్యోగులుగా చూపించి సంక్షేమ పథకాల్ని తీసేయడం అన్యాయమని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాన పనికి సమాన వేతనం అందించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకుంటే ఉద్యమబాట పడతామని నేతలు హెచ్చరించారు.
Sanitation Workers Protest in Madasikara: మడకశిరలో పారిశుద్ధ్య కార్మికుల ఆందోళన.. కార్యాలయానికి తాళం
మున్సిపల్ కార్మికుల న్యాయబద్ధమైన సమస్యలను పరిష్కరించుకుంటే ఈ నెలాఖరులో సమ్మెలోకి వెళ్తామని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ నేతలు తెలిపారు. ఈ మేరకూ వైఎస్ఆర్ కడప జిల్లా కలెక్టరెట్ ముందు వంటావార్పు కార్యక్రమంలో పాల్గొని తమ నిరసనను వ్యక్తం చేశారు. మున్సిపల్ కార్మికులు సమ్మెలోకి వెళ్తే జరగబోయే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని హెచ్చరించారు. సమ్మెలోకి వెళ్లడం వల్ల పరిసర ప్రాంతాలు అపరిశుభ్రమై అంటూ రోగాలు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మున్సిపల్ కార్మికులను క్రమబద్ధీకరించి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ప్రధాన డిమాండ్ పరిష్కరించాం.. సమ్మె విరమించాలి: మంత్రి సురేష్
జగన్ గతంలో మున్సిపల్ కార్మికులకు ఇచ్చిన హామీల... అమలులో మాట తప్పారని, మడమ తిప్పారని మున్సిపల్ కార్మికులు ఆరోపించారు. నా మేనిఫెస్టోయే బైబిలు, భగవద్గీత, ఖురాన్ కంటే గొప్పదని సీఎం గతంలో చెప్పారని గుర్తుచేశారు. కానీ, అందులో పేర్కొన్న సమాన పనికి సమాన వేతనం అమలు విషయంలో విఫలమయ్యారని కార్మిక నేతలు దుయ్యబట్టారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 2019 ఎన్నికలకు ముందు అసెంబ్లీలోను, బయట మున్సిపల్ కార్మికులకు అనేక వాగ్దానాలు చేశారని, అధికారంలోకి వచ్చాక ఐదు సంవత్సరాలు అవుతున్నా ఏ ఒక్కటి అమలు చేయలేదని ఆయన తెలిపారు.