ETV Bharat / state

'అమ్మోనియం నైట్రేట్‌ విషయంలో పటిష్ట చర్యలు చేపట్టండి'

author img

By

Published : Aug 15, 2020, 11:34 AM IST

అమ్మోనియం నైట్రేట్‌ విషయంలో పటిష్ట చర్యలు చేపట్టాలని కోరుతూ నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాశారు. పోర్ట్ కి అధిక మొత్తంలో నిల్వలు రావటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారన్నారు.

MP Srikrishnadevarayalu's letter to the Prime Minister
ప్రధానికి ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు లేఖ

ప్రమాదకరమైన అమ్మోనియం నైట్రేట్‌ విషయంలో పటిష్ట చర్యలు చేపట్టాలని కోరుతూ నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాశారు. ఈ రసాయనం అధికంగా దిగుమతి అయ్యే విశాఖ పోర్టులో ప్రమాదం జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. మైనింగ్, నిర్మాణం, ఎరువుల తయారీ, వాణిజ్య పేలుడు పదార్థాల తయారీలో అమ్మోనియం నైట్రేట్‌ను వినియోగిస్తారని పేర్కొన్నారు., విశాఖపట్నం పోర్టు లెక్కల ప్రకారం ఏడాదికి 2 నుంచి 3 లక్షల టన్నుల అమ్మోనియం నైట్రేట్‌ పోర్టుకి చేరుతుందని.. ఈ నెల 11న మరో 20 వేల నైట్రేట్‌ పోర్టుకి వచ్చిందని, విశాఖపోర్ట్ కి అధిక మొత్తంలో నిల్వలు రావటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారన్నారు.

ఈ రసాయనాన్ని ప్రైవేట్‌ గోదాముల్లో నిల్వ చేస్తున్నారని వాటిని ప్రభుత్వ గోదాముల్లోకి మార్చాల్సిన అవసరం ఉందని లేఖలో పేర్కొన్నారు. ప్రజల భయాందోళనను నివృత్తి చేసేందుకు పటిష్ట చర్యలు చేపట్టాలని కోరారు. రసాయనాన్ని దిగుమతి చేసుకుంటున్న ఆయా కంపెనీలు భద్రపరచటం, రవాణాలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నేషనల్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ పటిష్ట కార్యాచరణ రూపొందించి అమలు చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. అంతేకాకుండా ఈ నిల్వల విషయంలో చేపడుతున్న జాగ్రత్తలు, కల్పిస్తున్న సౌకర్యాలను ఆడిట్‌ చేసి నివేదికను పార్లమెంట్‌ ఉభయ సభలకు అందించాలని లేఖలో పేర్కొన్నారు.

ఇదీ చూడండి.
సముద్రంలో గల్లంతైన మత్స్యకారులు క్షేమం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.