గుంటూరు శివారులో అక్షయ శీతల గోదామును ఎంపీ జీవీఎల్ ప్రారంభించారు. రైతులు పండించిన పంటను నిల్వ చేసుకునేందుకు ఇలాంటి గోదాములు మరిన్ని రావాల్సి ఉందన్నారు. గోదాముల్లో ఆధునిక సాంకేతికత వచ్చిందని... పంటకు మంచి ధర వచ్చే వరకూ సరకు భద్రంగా నిల్వ చేసుకోవచ్చని తెలిపారు. వ్యవసాయ రంగంలో మౌలిక సదుపాయాల కల్పన కోసం కేంద్రం లక్ష కోట్ల రూపాయలతో నిధి ఏర్పాటు చేసిందని అన్నారు... అందులో 6వేల 500 కోట్ల రూపాయలు శీతల గోదాముల కోసం కేటాయించారని వివరించారు.
రాష్ట్రంలో 3వేల కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో మండల స్థాయిలో శీతల గోదాములు, గ్రామ స్థాయిలో సాధారణ గిడ్డంగులు ఏర్పాటు చేస్తున్నామని ఆయన తెలిపారు. వ్యవసాయాన్ని మరింత ఆధునికంగా మార్చి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని తెలిపారు. దేశ వ్యాప్తంగా 7 వేల కోట్ల రూపాయలతో 10 వేల రైతు ఉత్పత్తి సంఘాలు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ప్రాంతాన్ని పారిశ్రామిక కేంద్రంగా మార్చాలని కేంద్రం నిర్ణయించిందని... లక్ష మందికి నేరుగా ఉద్యోగాలు వస్తాయని వివరించారు. అయితే పరిశ్రమలకు అవసరమైన భూములను రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చాలని... అపుడే పారిశ్రామిక అభివృద్ధి వేగంగా జరుగుతుందని అభిప్రాయపడ్డారు.
ఇదీ చూడండి. పన్ను కట్టకుండా దుస్తులు దిగుమతి... పట్టుకున్న అధికారులు...