గుంటూరు జిల్లా రాజుపాలెం మండలం ఉప్పలపాడు మండల ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న శేఖర్ బాబు ఉన్నత అధికారుల ఒత్తిడి తాళలేక మృతిచెందాడు. అతని మృతికి ప్రభుత్వం బాధ్యత వహించాలని ఎమ్మెల్సీ రామకృష్ణ డిమాండ్ చేశారు. నాడు-నేడు పనుల్లో ఉపాధ్యాయులను భాగస్వామ్యం చేయవద్దని... గతంలో అనేకసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లామని చెప్పారు. కానీ ఈ ప్రభుత్వం మొండిగా ప్రవర్తిస్తుందని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఉపాధ్యాయులకు ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. ఇదే విషయాన్ని విద్యాశాఖ మంత్రి, ప్రిన్సిపల్ సెక్రెటరీ దృష్టికి తీసుకువెళ్తామని రామకృష్ణ చెప్పారు.
ఇదీ చూడండి. డ్రగ్స్‌కు బానిసలు కావొద్దు... పోలీస్ శాఖ ప్రత్యేక వీడియో