ముఖ్యమంత్రి జగన్, మహిళా హోంమంత్రి సహా పలువురు మంత్రులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన.. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు బహిరంగ క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ డిమాండ్ చేశారు. కోడెల శివప్రసాదరావు వర్ధంతి సభలో పాలొన్న అయ్యన్నపాత్రుడు.. ఉపయోగించిన భాష ఆక్షేపణీయంగా ఉందన్నారు. ఎంతో రాజకీయ అనుభవం ఉన్న ఆయన.. దిగజారి మాట్లాడటం సరికాదన్నారు. ఆయన మాట్లాడిన దానిలో తప్పు ఏమీ లేదని మళ్లీ సమర్ధించుకోవడం సిక్కుచేటని దుయ్యబట్టారు. మహిళ హోంమంత్రిని కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం సరికాదని మండిపడ్డారు.
దళితులను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన అయ్యన్నపాత్రుడిపై ఎందుకు కేసులు పెట్టకూడదన్నారు. రాజకీయాల్లో భాష చాలా ముఖ్యమని అన్నారు. తక్షణమే చంద్రబాబు స్పందించి ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:
TDP: 'చంద్రబాబు జోలికొస్తే ఊరుకోం..సహనం నశిస్తే రోడ్లపై తిరగలేరు'