ETV Bharat / state

'వైకాపా బెదిరింపులకు భయపడకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలి' - tdp mlc Buddha Venkanna Latest News

అధికార పార్టీ దౌర్జన్యాలకు భయపడకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఓటర్లకు ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న సూచించారు. తిరుపతి లోక్​సభ ఉప ఎన్నిక సందర్భంగా చిత్తూరు జిల్లా బుచ్చినాయుడు కండ్రిగ మండలంలో పర్యటించారు.

tdp mlc Buddha Venkanna
ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న
author img

By

Published : Mar 27, 2021, 4:25 PM IST

త్వరలో జరగనున్న తిరుపతి లోక్​సభ ఉపఎన్నికలో తెదేపా విజయం సాధిస్తుందని ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ధీమా వ్యక్తం చేశారు. వైకాపా దౌర్జన్యాలకు భయపడకుండా ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. ఉప ఎన్నిక సందర్భంగా చిత్తూరు జిల్లా బుచ్చినాయుడు కండ్రిగ మండలంలో పర్యటించిన ఆయన స్థానిక తెదేపా కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు.

మండలంలో 29 పంచాయతీలకుగానూ 11 పంచాయతీల్లో తెదేపా మద్దతుదారులు.. సర్పంచులు విజయం సాధించడం అభినందనీయమన్నారు. విభేదాలను పక్కనపెట్టి త్వరలో జరగనున్న ఉపఎన్నికల్లో విజయానికి శ్రమించాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.

ఇదీ చూడండి:

సీఎం ముఖ్య సలహాదారు పదవికి నీలం సాహ్ని రాజీనామా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.