దళితుల అభివృద్దికి సీఎం జగన్ పాటుపడుతున్నారని గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కొనియాడారు. అంబేడ్కర్ ఆశయాలను సీఎం జగన్ సాకారం చేస్తున్నారన్నారు. దళితుల్లోనూ పారిశ్రామికవేత్తలను తయారు చేయడం కోసం 2021-2023 ప్రత్యేక పారిశ్రామిక విధానం తీసుకురావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ విధానంతో వెనుబడిన వర్గాలకు ఎంతో మేలు జరుగుతుందని ఎమ్మెల్యే శ్రీదేవి ఆశాభావం వ్యక్తం చేశారు. సీఎం మాటల మనిషి కాదని చేతల మనిషని... ఎస్సీ,ఎస్టీల పారిశ్రామిక విధానాన్ని ఏర్పాటు చేసి నిరూపించారన్నారు. ఇండస్ట్రీయల్ పార్కుల్లో ఎస్సీలకు 16.2 శాతం, ఎస్టీలకు 6 శాతం భూములు కేటాయించడంతో దళితులు మరింత వేగంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉందన్నారు.
ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు రూ.1 కోటి రూపాయిల ఇన్సెంటివ్‌లు ఇవ్వడం మంచి పరిణామం అన్నారు. అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగ పరచుకోవాలని ఆమె సూచించారు.. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నామినేటేడ్ పదవుల్లో దళితులకు పెద్దపీట వేశారని ఎమ్మెల్యే గుర్తు చేసుకున్నారు.
ఇదీ చూడండి. ఏవోబీలో మందుపాతర పేల్చిన మావోయిస్టులు