ETV Bharat / state

శంకర్‌విలాస్‌ వంతెన అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధం చేయండి: ఎమ్మెల్యే గిరిధర్‌రావు - undefined

గుంటూరు నగరంలోని శంకర్‌విలాస్‌ వంతెన అభివృద్ధి పనులపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఎమ్మెల్యే గిరిధర్‌రావు అధికారులకు సూచించారు. గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్‌ అనురాధతో సమావేశమై పలు అంశాలపై చర్చించారు.

mla giridhar rao on sankar villas brige
కమిషనర్‌ అనురాధతో సమావేశమైన ఎమ్మెల్యే గిరిధర్
author img

By

Published : Aug 27, 2020, 12:16 PM IST

గుంటూరు నగరంలో శంకర్‌విలాస్‌ వంతెనను ఆరు వరుసలుగా నిర్మించేందుకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఎమ్మెల్యే గిరిధర్‌రావు పేర్కొన్నారు. గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్‌ అనురాధతో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. గుంటూరు నగరంలో అన్ని డివిజన్లలో సరిగా రోడ్లు లేక స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని, సైడు కాల్వలు సరిగా లేకపోవడంతో ప్రజల ఇళ్ల వద్ద మురికి నీరు ఎక్కడిక్కడ నిల్వ ఉంటుందన్నారు.

నగరంలోని డివిజన్లలో సీసీ రోడ్ల అభివృద్ధి పనులు 20 రోజుల్లో పూర్తి చేయాలని ఎమ్మెల్యే అన్నారు. అదే విధంగా శ్రీ రామనామ క్షేత్రం, శ్యామలనగర్, షాదీ ఖానా రోడ్డ్ బీ‌టీ రోడ్లను కూడా త్వరిత గతిన పూర్తి చేయాలని తెలిపారు. యూ‌జీడీ పనుల త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు.

ఇదీ చదవండి: తెలుగునాట వినోదాల వీచిక.. 'ఈటీవీ' రజతోత్సవ వేడుక

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.