ETV Bharat / state

'మూడు రాజధానుల నిర్ణయానికి ప్రజల మద్దతుందనడానికి ఎన్నికల ఫలితాలే నిదర్శనం' - మూడు రాజధానులపై ఆళ్ల రామకృష్ణారెడ్డి కామెంట్స్

మూడు రాజధానుల నిర్ణయానికి ప్రజలంతా మద్దతు తెలిపారనడానికి మున్సిపల్ ఎన్నికల ఫలితాలే నిదర్శనమని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి చెప్పారు. మంగళగిరి ప్రభుత్వాసుపత్రిలో ఆళ్ల రామకృష్ణారెడ్డి కొవిడ్ టీకా తీసుకున్నారు.

MLA alla ramakrishna comments on capital amaravati

author img

By

Published : Mar 15, 2021, 3:02 PM IST

కొవిడ్ టీకా తీసుకున్న ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి

మున్సిపల్ ఎన్నికల ఫలితాలు చూసైనా ప్రతిపక్ష నేత చంద్రబాబు తన మనసు మార్చుకోవాలని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. 2024లో జరిగే శాసనసభ ఎన్నికలలోనూ ఇవే ఫలితాలు పునరావృతం అవుతాయని జోస్యం చెప్పారు. అమరావతిలో ఆందోళన చేస్తున్న రైతులంతా చంద్రబాబు చేసిన మోసం ఇప్పటికైనా గుర్తించాలన్నారు.

ప్రజలంతా జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నాయని రామకృష్ణ అన్నారు. స్వీయ రక్షణ పాటిస్తూ కరోనాకి దూరంగా ఉండాలని ఎమ్మెల్యే సూచించారు.

ఇదీ చదవండి: విజయవాడలో జనసేన అభ్యర్థుల ఓటమికి భాజపానే కారణం: పోతిన మహేశ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.