మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో తాగునీటి సమస్య రాకుండా చూడాలని... శాసనసభ్యులు ఆళ్ల రామకృష్ణారెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. నగర పాలక సంస్థలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై అధికారులతో ఆయన సమీక్షించారు. ప్రభుత్వం కేటాయించిన 1200 కోట్ల రూపాయలతో తాడేపల్లి, మంగళగిరి నగరాలను సుందరీకరించాలని చెప్పారు.
గ్రామాల్లో ఉంటున్న వారికి పట్టణ స్థాయి సౌకర్యాలు కల్పించాలని దిశానిర్దేశం చేశారు. నగరపాలక సంస్థలో ఉన్న 22 గ్రామాల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. రహదారుల నిర్మాణానికి ప్రాధాన్యత ఇవ్వాలని.. ప్రణాళికలు సిద్ధం చేయాలని చెప్పారు.
ఇదీ చదవండి: