గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో గ్రామ వాలంటీర్ల నియామక పత్రాల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి మేకతోటి సుచరిత పాల్గొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా వాలంటీర్ల వ్యవస్థతో స్వరాజ్య పాలన రాబోతోందని సుచరిత అన్నారు. పార్టీలు, కులాలు, మతాలకు అతీతంగా సంక్షేమ పథకాలను అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
ప్రజలు, ప్రభుత్వానికి మధ్య వారధిగా వాలంటీర్లు పని చేయాలన్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి సంక్షేమ పథకాన్ని వాలంటీర్లు ప్రజలకు చేర్చాలి సూచించారు. ఒక లక్షా యాభై వేల మందికి ఉద్యోగాలు పెద్దఎత్తున కల్పించామని హర్షం వ్యక్తం చేశారు. సీఎం పాదయాత్రలో ప్రజల కష్టాలు చూసి వాలంటీర్ల వ్యవస్థను తీసుకువచ్చారని తెలిపారు.
ప్రత్తిపాడులో 3 గ్రామ సచివాలయాల ఏర్పాటు జరుగుతుందని వెల్లడించారు. అక్టోబర్ 2 నాటికి సచివాలయాల ఏర్పాటు చేస్తామన్నారు.
ఇదీ చదవండి