గుంటూరు జిల్లా మంగళగిరి చేనేతలకు.. దేశ విదేశాల్లో ఎంతో పేరుంది. నూలు, జరి, పట్టుతో తయారైన ఉత్పత్తులు..అన్ని ప్రాంతాల వారి ఆదరణ చూరగొన్నాయి. అయితే కొవిడ్ ప్రారంభమైన దగ్గర నుంచి దుకాణాలు మూతపడటంతో.. వ్యాపారులు అయోమయంలో పడ్డారు. ఆన్‌లైన్ షాపింగ్ విధానం అప్పటికే అందుబాటులో ఉన్నా.. మంగళగిరి చేనేత వ్యాపారులు పూర్తిగా దాన్ని అందిపుచ్చుకోలేదు. కరోనా దెబ్బపడ్డాక.. చిన్నచిన్న వ్యాపారులు సైతం.. ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌ను ఉపయోగించుకుంటూ తమ ఉత్పత్తులను ప్రచారం చేసుకోవడం మొదలుపెట్టారు.
అమెజాన్, మీషో, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ-కామర్స్ సంస్థలతో చేతులు కలిపితే.. కమీషన్ పోతుందని భావించిన వ్యాపారులు.. తామే స్వయంగా విక్రయాలను ప్రారంభించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి నగరాల నుంచి ఎక్కువగా ఆర్డర్లు వస్తున్నట్టు చెబుతున్నారు.
చేనేత ఉత్పత్తులకు డిమాండ్ పెరగటంతో.. యువకులూ ఇటువైపు ఆసక్తి చూపుతున్నారు. తయారీదారుల వద్ద కొనుగోలు చేసి.. స్వయంగా ఆన్‌లైన్‌లో విక్రయిస్తూ వ్యాపార ధోరణిని అలవర్చుకున్నారు.
ఇదీ చదవండి: