ప్రభుత్వం ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి తమ ప్రధానమైన డిమాండ్లను పట్టించుకోకుండా వ్యవహరించటం సరికాదని ఏపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.పాండు రంగ వరప్రసాదరావు అన్నారు.
ఆ నిర్ణయం హర్షనీయం..
నిరాహార దీక్షలతో ప్రభుత్వం బదిలీల షెడ్యూల్‌ను విడుదల చేయటం హర్షణీయమన్నారు. అయినాా ప్రధాన డిమాండ్లను మాత్రం ప్రభుత్వం పట్టించుకోవటంలేదన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం ఫ్యాప్టోతో చర్చించాలని ఆయన డిమాండ్ చేశారు.
అందుకు సర్కార్ పట్టించుకోలేదు..
ఎస్జీటీలు మాన్యువల్ కౌన్సెలింగ్ కావాలని అడిగితే అందుకు ప్రభుత్వం పట్టించుకోలేదని ఆందోళన వ్యక్తం చేశారు. వీటితో పాటు పదోన్నతితో ఖాళీ అయిన స్థానాల భర్తీ విషయంలోనూ ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరిస్తుందన్నారు. వీటన్నిటిపై ప్రభుత్వం.. ఉపాధ్యాయులతో చర్చించి నిర్ణయాలను తీసుకోవాలని కోరారు.
ఇవీ చూడండి : ఆడ బిడ్డలకు రక్షణ ఇవ్వని చట్టాలు ఎందుకు..?: పవన్