ETV Bharat / state

ఘోర ప్రమాదం జనంపైకి దూసుకెళ్లిన లారీ... నలుగురి మృతి - గుంటూరు జిల్లాలో లారీ ప్రమాదం

తొందరగా పనులు ముగించుకొని శివుని దర్శించుకుని వద్దామనుకున్నా వారిని లారీ మృత్యు రూపంలో కబళించింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు, మరో ఐదుమందికి గాయాలయ్యాయి. ఈ ఘటన గుుంటూరు జిల్లా చిలకలూరిపేట యడ్లపాడు వద్ద జరిగింది.

ఘోర ప్రమాదం జనంపైకి దూసుకెళ్లిన లారీ... నలుగురి మృతి
author img

By

Published : Nov 12, 2019, 11:55 AM IST

ఘోర ప్రమాదం జనంపైకి దూసుకెళ్లిన లారీ... నలుగురి మృతి

గుంటూరు జిల్లా యడ్లపాడు మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని తిమ్మాపురం సమీపంలో రోడ్డుపై నిలుచుకున్న వారిపైకి ఓ లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందగా.. మరో ఐదుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చిలకలూరిపేట ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులను కల్పతరు స్పిన్నింగ్‌ మిల్లుకు చెందిన కార్మికులుగా గుర్తించారు. క్షతగాత్రుల్లో నరేష్ , భవానీ , జితేంద్ర దాసుతో పాటు.. భూమిక, యామిని అనే ఇద్దరు చిన్నారులున్నారు. చిన్నారుల పరిస్థితి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కుటుంబాలతో కలిసి చిలకలూరిపేటలోని శివాలయానికి బయలుదేరారు... బస్సు కోసం రోడ్డు పక్కన వేచిఉన్న సమయంలో ఐరన్ లోడ్ లారీ డివైడర్​ను ఢీకొట్టి వీరిపైకి దూసుకెళ్లింది. దీంతో దైవదర్శనానికి వెళ్తున్న వారు మృత్యువాత పడాల్సి వచ్చింది. డ్రైవర్‌ అతివేగంగా లారీని నడపడటం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు.

ఇవీ చదవండి

డివైడర్​ను ఢీకొట్టి జనాలపైకి వెళ్లిన లారీ.. ముగ్గురు మృతి

AP_GNT_25_11_ROAD_ACCIDENT_AVB_AP10169 CONTRIBUTOR : ESWARACHARI, GUNTUR Note : feed send through mojo kit ( ) గుంటుూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా.. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. చిలకలూరిపేట యడ్లపాడు మండలం తిమ్మాపురం వద్ద రోడ్డుపక్కన నిల్చున్న వారిపైకి ఐరన్ లోడ్ తో లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో హర్ష అనే 3 ఏళ్ళ చిన్నారి అక్కడికక్కడే మృతి చెందగా... భార్య పింకీ దాసు , భర్త బిదందర్ దాసు ఇద్దరు చికిత్స పొందుతూ చిలకలూరిపేట వైద్యశాలలో మృతి చెందారు. మరో ఐదుమంది తీవ్రంగా గాయపడ్డారు. గాయాలపాలైన వారిని వెంటనే గుంటూరు లోని స్టార్ ఆసుపత్రికి తరలించారు. వీరిలో భూమిక, యమని అనే ఇద్దరు చిన్నారులు .... నరేష్ , భవానీ , జితేంద్ర దాసు అనే ముగ్గురు పెద్ద వారు ఉన్నారు. యామిని , భవాని ల పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. వీరందరూ తిమ్మాపురంలోని కల్పతరు స్పిన్నింగ్ మిల్లులో పనిచేస్తున్న కార్మికులు... ఇవాళ కార్తీక సోమవారం కావటంతో వారి కుటుంబాలతో కలిసి చిలకలూరిపేటలోని శివాలయానికి బయలుదేరారు. బస్సు కోసం రోడ్డు పక్కన వేచిఉన్న సమయంలో వేగంగా దూసుకొచ్చిన ఐరన్ లోడ్ లారీ డివైడర్ ను ఢికొట్టి వీరిపైకి దూసుకెళ్లింది. దీంతో దైవదర్శనానికి వెళ్తున్న వారు మృత్యువాత పడాల్సి వచ్చింది. బైట్.... సికిందర్ దాసు, బాధితుడు బంధువు బైట్.... సుబ్బారావు, చిలకలూరిపేట రూరల్ సిఐ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.