nara lokesh : అమరావతిపై న్యాయస్థానం ఇచ్చిన తీర్పును వైకాపా మంత్రులు గౌరవించి.. రాజధానిని అభివృద్ధి చేయాలని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సూచించారు. న్యాయవ్యవస్థపై విమర్శలు మాని భవిష్యత్ కార్యక్రమాలపై దృష్టి సారించాలని హితవు పలికారు. మంగళగిరిలో కరోనాతో మృతి చెందిన పార్టీ కార్యకర్తల కుటుంబసభ్యులను లోకేశ్ పరామర్శించారు. కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
వివేకానందరెడ్డిని హత్యను చేసింది ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డేనని స్పష్టమైందనన్నారు. ఆ రోజు హత్య జరిగిన తర్వాత అవినాష్ ఫోన్ నుంచి ఎవరెవరికి కాల్స్ వెళ్లాయో వాటిపై దర్యాప్తు చేస్తే అందరి పేర్లూ బయటకు వస్తాయన్నారు. హత్య కేసులో జగన్ పాత్రపై పూర్తిస్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: హైకోర్టు తీర్పుతో.. అమరావతి అభివృద్ధిపై చిగురిస్తున్న ఆశలు