Lokesh fire on YSRCP Government : గత నెల 30 తేదీన టీడీపీ పిలుపునిచ్చిన మోత మోగిద్దాంలో పాల్గొన్న వారిపై పోలీసులు కేసులు నమోదు చేయడంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. జగన్‌కు పిచ్చి పీక్స్‌లో ఉందంటూ తీవ్రంగా మండిపడ్డారు.
Nara Lokesh Tweet: విజిల్స్ వేసి సౌండ్ చేశారని 60 మందిపై కేసులా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిని పోలీస్ స్టేషన్‌కు పిలిచి విచారిస్తారా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ప్రభుత్వ తీరు చూస్తుంటే టీవీలో చంద్రబాబు అరెస్ట్ వార్తలు చూశారని, పసుపు రంగు దుస్తులు కట్టుకున్నారని, సైకిల్ బ్రాండ్ అగరబత్తీలు వాడారని కూడా కేసు పెట్టేలా ఉన్నారంటూ ఎద్దేవా చేశారు. ఒక పని చేయండి రాజద్రోహం కేసు పెట్టి.. ఉరిశిక్ష సైతం వేసేయండీ అంటూ అసహనం వ్యక్తం చేశారు. జగన్‌కి పిచ్చి పీక్స్‌లో ఉన్నట్లు ఉందని.. కేసులు పెట్టాలని ఆదేశాలు ఇచ్చినోడికి సరే.. అసలు వాటిని అమలు చేసినోడి బుర్రా, బుద్ధీ ఏమయ్యింది అంటూ ప్రశ్నించారు.
Police cases registered on TDP Motha Mogiddam: మోత మోగిద్దాంలో పాల్గొన్న వారిపై కేసులు నమోదు..!
Police Cases Registered on Motha Mogiddam: టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టుకు వ్యతిరేకిస్తూ.. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం దేశం నేతలు, కార్యకర్తలు ప్రతి ఒక్కరూ మోత మోగిద్దాం కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా గుంటూరు బృందావన్ గార్డెన్స్ రోడ్డులో మోత మోగిద్దాం (Motha Mogiddam) కార్యక్రమంలో పాల్గొన్న వారిపై పట్టాభిపురం పోలీసులు కేసు నమోదు చేశారు. నిరసన కార్యక్రమానికి ఎటువంటి అనుమతులు లేవని పోలీసులు తెలిపారు.
పోలీసు యాక్ట్ అమల్లో ఉన్నా.. ప్రజలకు ఆటంకం కలిగించేలా రహదారిపై నిరసన తెలిపారని చెప్పారు. నిషేధాజ్ఞలను అతిక్రమించి రహదారిపైకి గుంపులుగా చేరి.. ప్లేట్లు, విజిల్స్, డప్పులతో శబ్దం చేస్తూ ట్రాఫిక్ అంతరాయం కలిగించారంటూ కేసు నమోదు చేశారు. పోలీసుల విధులకు సైతం ఆటంకం కలిగించడంతో నిరసన కార్యక్రమంలో పాల్గొన్న వారిపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
దీంతో పోలీసుల తీరుపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రజాస్వామ్యంలో నిరసనలు తెలపడం ప్రజలు, పార్టీల హక్కు అని.. ప్రభుత్వాలు సరిగా పని చేయనప్పుడు ప్రజలు తమ గొంతుకను వినిపించేందుకు నిరసనలు ఆయుధంగా ఉపయోగపడుతాయని తెలిపారు. అధికార పార్టీ నేతలు చేసే ర్యాలీలు, మీటింగ్‌ల కారణంగా ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడటం లేదా అంటూ తెలుగుదేశం నేతలు ప్రశ్నిస్తున్నారు.
TDP Motha Mogiddam Program: టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్‌ను నిరసిస్తూ.. ఆ పార్టీ అధిష్ఠానం 'మోత మోగిద్దాం' కార్యక్రమానికి గత నెల 30వతేదీన రాత్రి 7 గంటన నుంచి 7.05 వరకు 5 నిమిషాల పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం జగన్‌కు వినిపించేలా ఏదో ఒక రకంగా మోత మోగించాలని పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమంతో రాష్ట్రం మొత్తం దద్దరిల్లింది. వేలాది మంది ప్రజలు చంద్రబాబు అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా ప్లేట్లు, డప్పులు, విజిల్స్, హారన్లను మోగిస్తూ తమ మద్దతు తెలిపారు. దీంతో గుంటూరులో ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిపై కేసులు నమోదు చేశారు.
TDP Motha Mogiddam Program Telangana : చంద్రబాబు నాయుడుకు మద్దతుగా తెలంగాణలో 'మోత మోగింది'