గుంటూరు జిల్లాలో 155 మద్యం దుకాణాల్లో విక్రయాలు ప్రారంభమయ్యాయి. ఉదయం నుంచే దుకాణాల వద్ద జనం బారులు తీరారు. కరోనా ప్రభావిత కంటైన్మెంట్ జోన్ల పరిధిలో ఉన్న 125 దుకాణాలు తెరుచుకోలేదు.
గుంటూరు, మంగళగిరి, తాడేపల్లి, మాచర్ల, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, పొన్నూరు, నకరికల్లు ప్రాంతాల్లో దుకాణాలను అధికారులు తెరవలేదు. కొన్నిచోట్ల ధరలు అప్డేట్ కాక... మరికొన్నిచోట్ల సాంకేతిక సమస్యలతో అమ్మకాలు ఆలస్యంగా ప్రారంభమయ్యాయి.
తొలిరోజు కావడం వల్ల అక్కడక్కడా సమస్యలు తలెత్తుతున్నాయని అబ్కారీ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ తెలిపారు. మద్యం కొనుగోలు సందర్భంగా... వినియోగదారులు తప్పనిసరిగా భౌతిక దూరం పాటించాలని సూచించారు.
ఇదీ చూడండి: