గుంటూరు జిల్లా శావల్యపురం వద్ద అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. మందస్తు సమాచారంతో వాహన తనిఖీలు చేపట్టిన పోలీసులు.. లారీలో వాషింగ్ మిషన్లలో పెట్టి తరలిస్తున్న రూ.10 లక్షల విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. గోవా నుంచి కర్ణాటక మీదుగా గుంటూరు జిల్లా శావల్యపురం మండలం కారుమంచికి అక్రమంగా మద్యం తరలిస్తున్నట్లు గుర్తించారు.
మద్యాన్ని తరలిస్తున్న మహబూబ్ బాషా, వెంకటరావు అనే ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మద్యం, ఇసుక అక్రమ రవాణా జరిగితే ప్రజలు సమాచారం ఇవ్వాలని గుంటూరు గ్రామీణ ఎస్పీ విశాల్ గున్నీ కోరారు. మద్యం అక్రమ రవాణా, అమ్మకాలు రవాణా చేసే వారిపై పీడీ యాక్టు వెనకాడబోమని ఎస్పీ హెచ్చరించారు.
ఇదీ చదవండి: