గుంటూరు జిల్లా మాచవరం మండలంలోని మోరంజపాడు గ్రామంలో ఎక్సైజ్ పోలీసులు తెలంగాణ నుంచి తరలిస్తున్న మద్యాన్ని పట్టుకున్నారు. 11 బస్తాల్లో రూ.3.5 లక్షలు విలువ చేసే సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఎక్సైజ్ ఎన్పోర్స్మెంట్కు వచ్చిన సమాచారంతో నరసరావుపేట సబ్ సూపరింటెండెంట్ వేంపల్లి చంద్రశేఖరరెడ్డి ఆధ్వర్యంలో పిడుగురాళ్ల, మాచర్ల ఎక్సైజ్ సీఐలు దాడులు నిర్వహించారు. గ్రామంలో చల్లా నాగారాజు ఇంట్లో నిల్వ ఉంచిన 11 బస్తాలను స్వాధీనం చేసుకుని... పిడుగురాళ్ల ఎక్సైజ్ పోలీస్ స్టేషన్కు తరలించారు.
ఇదీ చదవండి