గుంటూరు జిల్లాలో మద్యం దుకాణాల వద్ద మందుబాబులు క్యూ కడుతున్నారు. పెదకూరపాడులోని ఓ మద్యం దుకాణం వద్ద భౌతిక దూరం పాటించడం లేదు. మాస్కులు ధరించడం లేదు. గొడుగు విధానం అమలు చేస్తున్నట్లు అధికారులు చెప్తున్నా.. నిబంధనలు కనిపించడం లేదు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో కరోనా కేసులు పెరగడంతో.. కంటైన్మెంటు జోన్లను ఏర్పాటు చేశారు. ఆ ప్రాంతాల్లో మద్యం దుకాణాలు మూతపడ్డాయి. దీంతో ఎక్కడ మద్యం దుకాణం తెరిస్తే అక్కడకు మద్యం ప్రియులు పరుగులు పెడుతున్నారు. జిల్లాలో కరోనా కేసుల సంఖ్య 10వేలు దాటినా.. మరిన్ని కేసులు నమోదవుతున్నా పట్టించుకోవడం లేదు. ఇష్టారాజ్యంగా బయటకు వచ్చి.. కరోనాకి ఆహ్వానం పలుకుతున్నారు. మద్యం దుకాణాల సిబ్బంది, వాలంటీర్లు ఉన్నా.. మద్యం దుకాణాల వద్ద నిబంధనలు అమలు కావడం లేదు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో కొత్తగా.. 7,813 కరోనా కేసులు నమోదు