ETV Bharat / state

కేరళ పర్యాటక శాఖ సంచాలకుడిగా కృష్ణతేజ నియామకం - ఐఏఎస్ కృష్ణతేజ తాజా వార్తలు

కేరళ రాష్ట్రానికి కీలకమైన పర్యాటక శాఖ సంచాలకుడిగా తెలుగు ఐఏఎస్ అధికారి మైలవరపు కృష్ణతేజ నియమితులయ్యారు. ఈ మేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

కేరళ పర్యాటక శాఖ సంచాలకుడిగా కృష్ణతేజ నియామకం

author img

By

Published : Feb 24, 2021, 3:47 AM IST

కేరళ రాష్ట్రానికి కీలకమైన పర్యాటక శాఖ నూతన డైరెక్టర్ గా తెలుగు ఐఏఎస్ అధికారి మైలవరపు కృష్ణతేజకు ఆ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. ఇప్పటికే పర్యాటక శాఖ అదనపు డైరెక్టర్ జనరల్ గా ఉన్న కృష్ణతేజకు అదే శాఖలో డైరెక్టర్​గా పదోన్నతి కల్పించిన కేరళ ప్రభుత్వం.. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. తిరువంతనపురం స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ సీఈవో గానూ కృష్ణతేజకు అదనపు బాధ్యతలు అప్పగించింది. 2015 బ్యాచ్ కి చెందిన ఐఏఎస్ అధికారి కృష్ణతేజ.. రెండేళ్ల క్రితం కేరళ వరదల సమయంలో అలెప్పీ సబ్ కలెక్టర్ అత్యుత్తమ పనితీరుతో జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్నారు. ఆపరేషన్ కుట్టునాడు, ఐయామ్ ఫర్ అలెప్పీ కార్యక్రమాలతో వరద బాధితులకు అండగా నిలిచారు.

ఇదీ చదవండి: అగ్రవర్ణ పేదలకు గుడ్​ న్యూస్.. 'ఈబీసీ నేస్తం'కు కేబినెట్‌ ఆమోదం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.