ETV Bharat / state

నేడు, రేపు.. నాగార్జున యూనివర్సిటీలో మెగా జాబ్​ మేళా..! - Guntur district latest news

నేడు, రేపు.. నాగార్జున యూనివర్సిటీలో మెగా జాబ్​ మేళా నిర్వహించనున్నట్లు ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు.ఈ జాబ్ మేళాలో 210 కంపెనీలు పాల్గొంటున్నాయని... 26,289 ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. దీని వెనుక ఎటువంటి రాజకీయ ప్రయోజనం లేదని, అందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

నాగార్జున యూనివర్సిటీ
నాగార్జున యూనివర్సిటీ
author img

By

Published : May 6, 2022, 8:58 PM IST

Updated : May 7, 2022, 4:25 AM IST

గుంటూరు జిల్లాలోని నాగార్జున యూనివర్సిటీలో నేడు, రేపు మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు రాజ్యసభ సభ్యలు విజయసాయిరెడ్డి వెల్లడించారు. యువతకు అండగా నిలబడేందుకే జాబ్ మేళాలకు శ్రీకారం చుట్టినట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో మూడు దశల్లో ఈ జాబ్ మేళాల నిర్వహణకు ప్రణాళికలు రూపొందించమన్నారు. తిరుపతి, విశాఖపట్నంలలో ఇప్పటికే పూర్తిచేసినట్లు చెప్పారు. ఆ రెండుచోట్లా కలిపి 30,473 మందికి ఉద్యోగాలు ఇచ్చామన్నారు.

నాగార్జున యూనివర్శిటిలో జరిగే జాబ్ మేళాలో 210 కంపెనీలు పాల్గొంటున్నాయని... 26,289 ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఎంపీ విజయసాయి రెడ్డి తెలిపారు. ఈ జాబ్ మేళా కోసం 97వేల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని... వారికి వైకాపా అనుబంధ విభాగాలు సహకరిస్తాయన్నారు. ఉద్యోగాలు పొందలేకపోయిన వారికి నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా శిక్షణ ఇస్తామన్నారు. జాబ్ మేళా నిర్వహణ వెనుక ఎటువంటి రాజకీయ ప్రయోజనం లేదని, అందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గతంలో జరిగిన రెండు జాబ్ మేళాల కంటే నాగార్జున యూనివర్శిటీలో జరుగనున్న ఈ కార్యక్రమానికి ఎక్కువ స్పందన లభించిందని శాసనమండలిలో చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తెలిపారు.

ఇదీ చదవండి: 'ఇడ్లీ ఇస్తే తినలేదని.. దారుణంగా కొట్టి హత్య చేశారు'

Last Updated : May 7, 2022, 4:25 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.