ETV Bharat / state

Jio 5G Services in Hyderabad : హైదరాబాద్‌లో 5జీ సేవలు ప్రారంభం - హైదరాబాద్‌లో జియో 5జీ సేవలు

Jio 5G Services in Hyderabad : భాగ్యనగరంలో ట్రూ-5జీ సేవలు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్‌తో పాటు బెంగళూరులో కూడా ఈ సేవలను ప్రారంభించినట్లు రిలయన్స్ జియో ప్రకటించింది. టెక్‌ నగరాలుగా పేరుగాంచిన హైదరాబాద్‌, బెంగళూరుల్లో 5జీ సేవల ప్రారంభంతో, ప్రజల జీవన ప్రమాణాలు మరింత మెరుగవుతాయని జియో తెలిపింది.

హైదరాబాద్‌లో 5జీ సేవలు ప్రారంభం
హైదరాబాద్‌లో 5జీ సేవలు ప్రారంభం
author img

By

Published : Nov 11, 2022, 11:37 AM IST

Jio 5G Services in Hyderabad : హైదరాబాద్‌, బెంగళూరు నగరాల్లో ట్రూ-5జీ సేవలను ప్రారంభించినట్లు రిలయన్స్‌ జియో గురువారం ప్రకటించింది. 5జీ సేవలు నగరం అంతటా కాకుండా, తొలుత కొన్ని ప్రాంతాల్లోనే లభించే వీలుంది. 5జీ స్మార్ట్‌ఫోన్లలో సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌లను వినియోగదారులు సరిచూసుకోవాలి. ఇప్పటికే హైదరాబాద్‌లో ఎయిర్‌టెల్‌ 5జీ సేవలు లభి స్తున్నాయి. జియో కూడా చెన్నై, ముంబయి, దిల్లీ, కోల్‌కతా, వారణాసి, నత్‌ద్వారా నగరాల్లో ట్రూ-5జీ బీటా సేవలను ఇప్పటికే అందిస్తోంది.

Jio 5G Services in Bangalore : టెక్‌ నగరాలుగా పేరుగాంచిన హైదరాబాద్‌, బెంగళూరుల్లో 5జీ సేవల ప్రారంభంతో, ప్రజల జీవన ప్రమాణాలు మరింత మెరుగవుతాయని జియో తెలిపింది. సేవల్లో నాణ్యత కోసమే ట్రూ-5జీ సేవలను వివిధ నగరాల్లో దశలవారీగా ప్రారంభిస్తున్నట్లు వెల్లడించింది. జియో ట్రూ-5జీ వెల్‌కమ్‌ ఆఫర్‌లో భాగంగా, ప్రస్తుత వినియోగదార్లు ఎటువంటి అదనపు చెల్లింపులు లేకుండా 1జీబీపీఎస్‌ వేగంతో అపరిమిత డేటా పొందొచ్చని పేర్కొంది.

ఐఫోన్లలో 5జీ బీటా అప్‌డేట్‌.. ఎయిర్‌టెల్‌, జియో నెట్‌వర్క్‌లపై 5జీ సేవలు పొందేందుకు వీలుగా తమ ఐఫోన్లలో 5జీ బీటా సాఫ్ట్‌వేర్‌ వెర్షన్‌ను యాపిల్‌ అప్‌డేట్‌ చేసింది. వినియోగదార్లు ఈ అప్‌డేట్‌ ఇన్‌స్టాల్‌ చేసుకుని, 5జీ సేవలను వాడుకోవాలని.. ఏవైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకొస్తే వాటిని పరిష్కరించేందుకే బీటా వెర్షన్‌ తీసుకొచ్చినట్లు యాపిల్‌ పేర్కొంది. డిసెంబరులో పూర్తి స్థాయి సాఫ్ట్‌వేర్‌ను విడుదల చేస్తామని వివరించింది. ఐఫోన్‌ 12, ఐఫోన్‌ 13, ఐఫోన్‌ 14 సిరీస్‌లోని అన్ని మోడళ్లతో పాటు ఐఫోన్‌ ఎస్‌ఈ (మూడో తరం) ఫోన్లకూ 5జీ బీటా సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ అందుబాటులో ఉందని తెలిపింది. బీటా ప్రోగ్రామ్‌ కోసం సైన్‌ అప్‌ చేసుకున్న వినియోగదార్లకు మాత్రమే, ప్రస్తుతం అందుబాటులోకి రానుంది. యాపిల్‌ ఐడీపై ఐక్లౌడ్‌ ఖాతా కలిగిన వినియోగదార్లు కూడా బీటా ప్రోగ్రామ్‌కు సైన్‌ అప్‌ చేసుకోవచ్చని వెల్లడించింది. 5జీ ఆప్షన్‌ను సెట్టింగ్స్‌ యాప్‌ నుంచి ఎనేబుల్‌ చేసుకుని రిలయన్స్‌ జియో, భారతీ ఎయిర్‌టెల్‌ 5జీ నెట్‌వర్క్‌ అందుబాటులో ఉన్న చోట వినియోగించుకోవచ్చని తెలిపింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.