ETV Bharat / state

కిటికీకి ఉరేసుకుని ఇంటర్మీడియట్ విద్యార్థిని ఆత్మహత్య - గుంటూరులో ఆత్మహత్య వార్తలు

ఇంటర్మీడియట్​ ప్రథమ సంవత్సరం చదువుతున్న ముగ్గురు విద్యార్థినులు రోజులాగానే స్డడీ సర్కిల్​కి వెళ్లారు. అందులోని ఒక అమ్మాయి మాత్రం అక్కడికి వెళ్లిన గంటకు హాస్టల్​కి చేరుకుంది. ఆ తర్వాత కొద్దిసేపటికి మిగిలిన వారు ఆ గదిలోకి రాగా.. అప్పటి వరకు వారితో సరదాగా మాట్లాడిన స్నేహితురాలు కిటికీకి తాడుకట్టుకుని ఊరేసుకుంది. ఈ ఘటన గుంటూరులో జరిగింది.

intermediate  student suicide at guntur
కిటికీకి ఉరేసుకుని ఇంటర్మీడియట్ విద్యార్థిని ఆత్మహత్య
author img

By

Published : Apr 7, 2021, 1:46 PM IST

Updated : Apr 7, 2021, 2:00 PM IST

గుంటూరులో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్నవిద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం మిట్టమీదపల్లె గ్రామానికి చెందిన నల్లపు లావణ్య (17) నగర శివారులోని పలకలూరు విజ్ఞాన్ మహిళా కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతోంది. లావణ్య ఉండే గదిలో మరో ముగ్గురు విద్యార్థినులు ఉంటున్నారు. రోజులాగానే ఉదయాన్నే స్టడీ హాల్​కి వెళ్లిన లావణ్య గంట తరువాత గదికి వచ్చింది. తోటి విద్యార్థినులు స్టడీ ముగించుకుని గదికి వచ్చేసరికి .. గదిలోని కిటికీకి తాడు కట్టుకుని ఉరేసుకున్నట్లు గుర్తించి.. పోలీసులకు సమాచారం అందించారు.

కళాశాల సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన నల్లపాడు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. చదువు ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుందా లేక ఎవరైనా ఏమైనా అన్నారా అనే కోణంలో పోలీసులు పరిశీలిస్తున్నారు. అప్పటిదాకా తమతో ఉన్న స్నేహితురాలు ..ఆత్మహత్య చేసుకోవడంతో వారు కన్నీరుమున్నీరయ్యారు.

ఇదీ చూడండి. తెలంగాణ: నీటిసంపులో పడేసి పసికందును చంపిన తండ్రి

Last Updated : Apr 7, 2021, 2:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.