తెలంగాణ నుంచి అక్రమంగా మద్యం తరలిస్తున్న నలుగురు వ్యక్తులను గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీసులు అరెస్టు చేశారు. మద్యం తరలించేందుకు తాడేపల్లికి చెందిన ఏడుగురు వ్యక్తులు ఓ ఆటోను రీమోడల్ చేశారు. సీటు కింద ప్రత్యేకంగా ర్యాక్ ను ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని కోదాడ నుంచి ర్యాక్లో మద్యం తీసుకొచ్చి తాడేపల్లిలో కొంత మందికి విక్రయిస్తున్నారు.
వారం రోజులుగా అక్రమంగా రవాణా సాగుతోంది. ఈ వ్యవహారంపై నిఘా పెట్టిన పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఆటోలో తరలిస్తున్న 374మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని... నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
ఇదీ చదవండి: