ETV Bharat / state

అక్రమంగా తరలిస్తున్న 194 బస్తాల రేషన్​ బియ్యం పట్టివేత - గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం తాజా సమాచారం

గుంటూరులో అక్రమంగా రేషన్​ బియ్యం తరలిస్తున్న 3 టాటా ఏస్​ వాహనాలను యడ్లపాడు పోలీసులు పట్టుకున్నారు. గుంటూరు నుంచి యడ్లపాడు మండలం సొలసకు వీటిని తరలిస్తుండగా.. లింగారావుపాలెం వద్ద వీటిని పోలీసులు అడ్డుకున్నారు. వాహనాల్లోని ఏడుగురిని పోలీసులు అరెస్ట్​ చేశారు.

illegal ration rice transport vehicles seized
అరెస్ట్​ అయిన వ్యక్తులు
author img

By

Published : Dec 31, 2020, 4:26 PM IST

గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం లింగారావుపాలెం వద్ద 3 టాటా ఏస్​ వాహనాలలో అక్రమంగా తరలిస్తున్న 194 బస్తాల రేషన్ బియ్యాన్ని యడ్లపాడు పోలీసులు పట్టుకున్నారు. గుంటూరు నుంచి యడ్లపాడు మండలం సొలసకు రేషన్​ బియ్యాన్ని తరలిస్తుండగా.. మార్గమధ్యంలో లింగారావుపాలెం ఎస్​ఐ శ్రీహరి ఆధ్వర్యంలో పట్టుకున్నారు. ఏడుగురుని అరెస్ట్​ చేసి.. వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలో రేషన్​బియ్యం అక్రమాలు ఏమాత్రం ఆగడం లేదు. ప్రతిరోజూ ఏదో ఒక ప్రాంతంలో పెద్ద ఎత్తున రేషన్​ బియ్యం పోలీసులకు పట్టుబడుతూనే ఉన్నాయి.

ఇదీ చదవండి: తహసీల్దార్ కార్యాలయానికి తాళం వేసిన మహిళా రైతు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.