రాష్ట్రంలో పలువురు అఖిల భారత సర్వీసు అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
- ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి (పొలిటికల్) ఆర్పీ సిసోడియాను గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమించారు.
- ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాశ్‌ను ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శిగా నియమించారు. ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి (పొలిటికల్)గా ప్రవీణ్ ప్రకాశ్‌కు పూర్తి స్థాయి బాధ్యతలు అప్పగించారు.
- విజయనగరం జిల్లా పార్వతీపురం ITDA ప్రాజెక్టు డైరెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్‌ను విజయవాడ సబ్ కలెక్టర్‌గా నియమించారు.
- అటవీశాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఎండీ. ఇలియాజ్ రిజ్వి రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమించారు.
- రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పొరేషన్ వీసీ అండ్ ఎండీ ఎన్. ప్రతీప్ కుమార్‌ను అటవీశాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్‌గా నియమితులయ్యారు.
ఇదీ చదవండి :