ETV Bharat / state

రహదారి విస్తరణ కోసం.. ఇళ్ల కూల్చివేత.. అడ్డుకున్న గ్రామస్థులు.. - జనసేన

Houses Demolition: గుంటూరు జిల్లాలో రహదారి విస్తరణ పనులు ఉద్రిక్తతకు దారి తీశాయి. రహదారి విస్తరణలో భాగంగా రోడ్డుకు ఇరువైపుల ఇళ్లను కూల్చివేస్తున్నారు. ఇళ్లను కూల్చివేస్తుంటే ఇళ్లను కోల్పోతున్న వారు అయోమాయంలో పడిపోయారు. వద్దని చెప్పిన నగరపాలక సిబ్బంది కూల్చివేస్తునే ఉన్నారు. దీంతో కోపోద్రిక్తులైన గ్రామస్థులు కూల్చివేతను అడ్డుకున్నారు. అడ్డుకున్నందుకు పోలీసులు బలవంతంగా వారిని అదుపులోకి తీసుకున్నారు.

Houses Demolition
ఇళ్ల కూల్చివేత
author img

By

Published : Nov 4, 2022, 3:30 PM IST

గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామంలో రహదారి విస్తరణ పనులలో ఉద్రిక్తత

Houses Demolition: గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామంలో రహదారి విస్తరణ పనులు ఉద్రిక్తతకు దారితీశాయి. ఇప్పటం గ్రామంలో రహదారి విస్తరణకు 120 అడుగులు మార్కింగ్ వేశారు. దీని ప్రకారం రోడ్డుకు ఇరువైపుల జేసీబీ సహాయంతో ఇళ్ల కూల్చివేతలు చేపట్టారు. కూల్చివేతపై గ్రామస్థులు మండిపడ్డారు. గ్రామానికి బస్సు సౌకర్యమే లేదని అలాంటప్పుడు రహదారులు ఎలా అభివృద్ధి చేస్తారని ప్రజలు ప్రశ్నించారు. జనసేన ఆవిర్భావ సభకు తమ భూములను ఇచ్చామన్న అక్కసుతోనే ప్రభుత్వం ఈ దారుణానికి ఒడిగట్టిందని ఆరోపించారు. ఆక్రమణలను అడ్డుకున్నగ్రామస్థులను పోలీసులు బలవంతంగా అదుపులో తీసుకున్నారు. గ్రామంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా పోలీసులను మోహరించారు. పోలీసుల సహాయంతో నగరపాలక సిబ్బంది కూల్చివేతలను కొనసాగించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.