మాది మాటల ప్రభుత్వం కాదు.. చేతల ప్రభుత్వం అని హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో జరిగిన ప్రజల్లో నాడు- ప్రజల కోసం నేడు పాదయాత్ర ముగింపు సభలో ఆమె పాల్గొన్నారు. మహిళా పక్షపాతి సీఎం జగన్ అని సుచరిత పేర్కొన్నారు. ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత ప్రజల్లోకి వెళ్లాలంటే రాజకీయ నాయకులు ఆలోచించాల్సిన పరిస్థితి గతంలో ఉండేదని.. కానీ సంక్షేమ పథకాల అమలుతో ఇప్పుడు ధైర్యంగా ప్రజల్లోకి వెళ్తున్నామన్నారు.
గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటుతో కిందిస్థాయి వరకు పాలనను తీసుకెళ్లిన ఘనత జగన్‌కే దక్కుతుందని సుచరిత అన్నారు. ఈ నిర్ణయంతో దేశంలోని రాష్ట్రాలన్ని మన వైపు చూస్తున్నాయని గుర్తుచేశారు. రానున్న నగరపాలక సంస్థ ఎన్నికల్లో గుంటూరు నగరంలో అభ్యర్థులను గెలిపించి ముఖ్యమంత్రికి కానుకగా ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గిరిధర్‌రావు, ముస్తఫా, ఎమ్మెల్సీ మాణిక్య వరప్రసాదరావు, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి, నాయకులు ఏసురత్నం, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: