గుంటూరు జిల్లా ప్రత్తిపాడు జిల్లా పరిషత్ పాఠశాలలో జగనన్న విద్యాకానుక కార్యక్రమాన్ని కలెక్టర్ శామ్యూల్ ఆనంద్‌తో కలసి హోంమంత్రి సుచరిత ప్రారంభించారు. అనంతరం ప్రసంగించారు. ఆంగ్ల మాధ్యమం బోధనతో పాటు నాడు-నేడు కింద పాఠశాలలు అభివృద్ధి చేస్తున్నామని వివరించారు. 2 లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల నుంచి ప్రభుత్వ బడులకు వచ్చారని చెప్పారు.
అక్షరాస్యతలో దేశ సగటు కన్నా.. రాష్ట్ర సగటు తక్కువగా ఉందని... అందుకే సీఎం జగన్ విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారని వివరించారు. రూ.261 కోట్లతో 1100 పాఠశాలలను తొలి విడతగా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. విద్యాకానుక ఇచ్చేందుకు రూ.650 కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు.
ఆడపిల్లలను బయటకు పంపాలంటే భయపడే వారని... ఇప్పుడు మహిళల రక్షణ కోసం దిశ లాంటి బలమైన చట్టాలు తీసుకువచ్చామన్నారు. ఆడపిల్లలను పాఠశాలకు పంపాలని హోంమంత్రి విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: