అపోహలు వదలి ప్రజలంతా వ్యాక్సినేషన్ తీసుకునేందుకు ముందుకు రావాలని హోంమంత్రి మేకతోటి సుచరిత పిలుపునిచ్చారు. కరోనా రెండోవిడత ఉద్ధృతంగా వ్యాపిస్తున్న సమయంలో వ్యాక్సిన్ ఒక్కటే మార్గమని అభిప్రాయపడ్డారు. గుంటూరు ఆరండేల్ పేట సాయి భాస్కర్ ఆస్పత్రిలో హోంమంత్రి కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు.
45 ఏళ్లు దాటిన వారందరికీ ప్రభుత్వ ఆరోగ్యకేంద్రాల్లో, సచివాలయాల్లో వ్యాక్సిన్లు వేస్తున్నారని.. సత్వరం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని హోంమంత్రి సుచరిత కోరారు. వైరస్ వ్యాప్తి పెరగడానికి ప్రజల్లో నిర్లక్ష్యమూ కారణమేనన్న ఆమె.. వైరస్ ను సమూలంగా పారదోలే వరకు వ్యక్తిగత రక్షణ పాటించాలని పిలుపునిచ్చారు.
ఇవీ చూడండి: