MLAs Poaching Case Update:తెలంగాణలో ఎమ్మెల్యేలకు ఎర కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న బీజేపీ కీలక నేత బీఎల్ సంతోష్, కేరళ వైద్యుడు జగ్గుస్వామికి హైకోర్టులో ఊరట లభించింది. తెలంగాణ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) జారీ చేసిన 41ఏ సీఆర్‌పీసీ నోటీసులపై స్టే విధించాలని కోరుతూ వారిద్దరూ దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం ఈ నెల 13వ తేదీ వరకు సిట్ నోటీసులపై స్టే విధించింది. తదుపరి విచారణ వరకు వారిద్దరిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కోర్టు ఆదేశించింది.
ఇవీ చదవండి: