జిల్లా వ్యాప్తంగా వర్షాలు... లోతట్టు ప్రాంతాలు జలమయం - గుంటూరుజిల్లాలో తాజా వార్తలు
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులపైకి వర్షం నీరు చేరడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వందల ఎకరాల్లో పంట పొలాలు వరద నీటిలో మునిగాయి. గుంటూరు జిల్లాలో మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు సగటున 16.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
జిల్లా వ్యాప్తంగా వర్షాలు
By
Published : Sep 30, 2020, 4:33 PM IST
గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారిపై వరదనీరు ప్రవహించడంతో వాహనరాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి మళ్లీ వరద పోటెత్తుతోంది. ప్రస్తుతం 60 వేల క్యూసెక్కుల వరదనీరు వస్తున్నట్లు అధికారులు తెలిపారు. పులిచింతల పూర్తి సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా... ప్రస్తుతం 44.79 టీఎంసీల నిల్వ ఉంది. వరద ప్రవాహం మేరకు 6 గేట్లు ఎత్తి లక్షా 5వేల క్యూసెక్కుల నీరు ప్రకాశం బ్యారేజికి విడుదల చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా నమోదన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి.