కరోనా నివారణకు నియంత్రణ చర్యలు చేపడుతున్నప్పటికీ గుంటూరు జిల్లాలో కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ప్రధానంగా నరసరావుపేటను కరోనా వైరస్ కుదిపేస్తోంది. నిన్న 12 కేసులు నమోదు కాగా నేడు మరో 10 కేసులు నమోదయ్యాయి. 2 కేసులు గుంటూరు అర్బన్ పరిధిలో వెలుగుచూశాయి. తాజా కేసులతో జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 363కు పెరిగింది.
గుంటూరు జిల్లా నరసరావుపేటలో వైరస్ శరవేగంగా వ్యాపిస్తోంది. 27 రోజుల్లోనే 163 కేసులు బయటపడ్డాయంటే వైరస్ వ్యాప్తి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. కొవిడ్ వ్యాప్తిని తగ్గించే లక్ష్యంతో 'మిషన్ మే 15' పేరుతో అధికారులు ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. నమోదవుతున్న కేసులన్నీ కంటైన్మెంట్ జోన్ల పరిధిలోనే కావడంతో మరిన్ని ప్రాంతాలకు విస్తరించకుండా అధికారులు చర్యలు చేపడుతున్నారు.
ఇదీచదవండి