ఆంధ్రప్రదేశ్ కళలు, హస్తకళలు - కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో శిల్పారామం క్రాఫ్ట్ బజార్ - 2019 ఏర్పాటు చేశారు. గుంటూరులోని తితిదే కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ప్రదర్శనను జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ ప్రారంభించారు. భారతదేశం కళలకు పెట్టింది పేరని... అంతరించిపోతున్న కళలకు జీవం పోసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తన వంతు కృషి చేస్తుందని కలెక్టర్ అన్నారు. ప్లాస్టిక్ రహిత సమాజానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. జ్యూట్ సంచులను వినియోగించాలని సూచించారు. నేటి నుంచి డిసెంబర్ 4 వ తేదీ వరకు ప్రదర్శన కొనసాగుతుందని తెలిపారు. నగర వాసులు క్రాఫ్ట్ బజార్ సందర్శించి హస్తకళలకు, చేనేత వస్త్రాలకు ఆదరణ కల్పించాలని కోరారు. క్రాఫ్ట్ బజార్లో సుమారు 60 దుకాణాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఇదీ చదవండి: