ETV Bharat / state

కోడెల సంస్మరణ సభకు భారీగా తరలిరండి: తెదేపా

నరసారావుపేటలో సోమవారం జరగనున్న మాజీ సభాపతి కోడెల సంస్మరణ కార్యక్రమానికి ప్రజలు భారీ సంఖ్యలో తరలిరావాలని తెదేపా గుంటూరు జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు పిలుపునిచ్చారు.

కోడెల సంస్మరణ సభకు భారీగా తరలిరండి: గుంటూరు తెదేపా నేతలు
author img

By

Published : Sep 29, 2019, 11:05 PM IST

కోడెల సంస్మరణ సభకు భారీగా తరలిరండి: గుంటూరు తెదేపా నేతలు

మాజీ స్పీకర్, తెదేపా ముఖ్య నేత కోడెల శివప్రసాదరావు బలవన్మరణం పార్టీకి తీరని లోటని పార్టీ గుంటూరు జిల్లా ప్రెసిడెంట్ జీవీ ఆంజనేయులు అన్నారు. ప్రభుత్వ వేధింపుల వల్లే ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు ఆరోపించారు. గుంటూరు జిల్లా నరసారావు పేటలోని కోడెల కుటుంబ సభ్యులను తెనాలి మాజీ ఎమ్మెల్యే ఆలపాటి రాజాతో కలిసి పరామర్శించారు. శివప్రసాదరావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. కోడెల సంస్మరణ కార్యక్రమానికి రాష్ట్ర ప్రజలు, అభిమానులు, కార్యకర్తలు భారీగా తరలిరావాలని నేతలు పిలుపునిచ్చారు.

కోడెల సంస్మరణ సభకు భారీగా తరలిరండి: గుంటూరు తెదేపా నేతలు

మాజీ స్పీకర్, తెదేపా ముఖ్య నేత కోడెల శివప్రసాదరావు బలవన్మరణం పార్టీకి తీరని లోటని పార్టీ గుంటూరు జిల్లా ప్రెసిడెంట్ జీవీ ఆంజనేయులు అన్నారు. ప్రభుత్వ వేధింపుల వల్లే ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు ఆరోపించారు. గుంటూరు జిల్లా నరసారావు పేటలోని కోడెల కుటుంబ సభ్యులను తెనాలి మాజీ ఎమ్మెల్యే ఆలపాటి రాజాతో కలిసి పరామర్శించారు. శివప్రసాదరావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. కోడెల సంస్మరణ కార్యక్రమానికి రాష్ట్ర ప్రజలు, అభిమానులు, కార్యకర్తలు భారీగా తరలిరావాలని నేతలు పిలుపునిచ్చారు.

ఇవీ చూడండి

ఈనెల 30న కోడెల పెద్దకర్మ..హాజరుకానున్న చంద్రబాబు

Intro:కిట్ 736

ap_vja_02_29_mattilo_manikayalu_students_pkg_avb_ap10044

ETV Contributor: k.Krishna Murthy (Avanigadda) - cell: 9299999511.

 యాంకర్ వాయిస్....
ప్రతిభ ఉంటే అవకాశాలు, పేరు ప్రఖ్యాతులు  వెతుకుంటూ వస్తాయని నిరూపించారు ఈ విద్యార్ధులు,  భారత దేశం తరపుతన జపాన్ లో జరిగిన  ప్రపంచ సునామీ అవగాహన సదస్సులో  ప్రభుత్వ పాఠశాలలలో చదివే ఈ విద్యార్ధులు  పాల్గొని  అందరి మన్ననలు పొందుతున్నారు, తల్లి తండ్రులు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు అనందం వ్యక్తం చేస్తున్నారు జపాన్ దేశంలో ప్రజలు అవలంబిస్తున్న పద్దతులు నేర్చుకుని తమ గ్రామంలో ప్రజలకు తెలియజేస్తు ఆదర్శంగా నిలుస్తున్నారు..

వాయిస్ ఓవర్....
  కృష్ణాజిల్లా, నాగాయలంక మండలం, తలగడదీవి గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదవతరగతి చదువుతున్న బత్తుల ముఖేష్, బండ్రెడ్డి జయంత్ వెంకట్,  తోట హేమంత్ కుమార్ , రావి వెంకట మనికంఠ లు  పకృతి విపత్తులు సంభవించినప్పుడు ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రర్తలపై స్కూల్ లో చేసిన ప్రాజెక్ట్ ను  స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఆంధ్రప్రదేశ్  వారికి పంపంగా అక్కడ ఈ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసి భారత దేశం తరపున  హై స్కూల్ స్థాయిలోవిధ్యార్ధులతో జపాన్ దేశంలో ప్రతి సంవత్సరం ప్రపంచ దేశాల విధ్యార్ధులతో నిర్వహించే  సదస్సులో  సెప్టెంబరు 5 నుండి 12 వ తేది వరకు జపాన్ దేశంలో జరిగిన సదస్సుకు 
 భారత దేశం తరపున ప్రభుత్వపాఠశాలలో చదువుతున్న ఈ  నలుగురు విద్యార్ధులు పాల్గొన్నారు. వీరి ప్రాజెక్ట్ లో ముఖ్య అంశాలు
పకృతి విపత్తులపై పై ప్రజలకు  అవగాహనా కల్పించాలి,  విపత్తుల మీద  డ్రిల్ చేయించాలి,  నాటకాలు  ప్రదర్శించం ద్వారా ప్రజలను చైతన్య పరచాలి ఇలా అనేక అంశాలపై  ప్రాజెక్ట్ చేసారు. దివిసీమ ప్రాంతం ఎక్కువగా తుపాన్లు, సునామీలు ప్రభావానికి గురియగుతూ ఉంటుందని ఎక్కువ ప్రాణ ఆస్థి నష్టం జరుగుతుందని  1977 సంవత్సరం వచ్చిన ఉప్పెనకు దివిసీమలో వేలాది మంది మృత్యువాత పడటం విపత్తుల సమయంలో ప్రజలను ఎలా కాపాడాలి అనే ఆలోచనతో ఉపాద్యాయుల సహకారంతో  ఈ ప్రాజెక్ట్ చేసామని విద్యార్ధులు తెలిపారు.  

జపాన్ దేశంలో జరిగిన ప్రపంచ సునామీ సదస్సులో 44 దేశాల నుండి విద్యార్ధులు పాల్గొన్నారు, మనదేశం నుండి ఈ నలుగురు విద్యార్ధులు పాల్గొన్నారు. తమ పిల్లలను  జపాన్ దేశం పంపటానికి ఈ విద్యార్ధుల తల్లి తండ్రులు పేదవారు కనీసం హైదరాబాదు  ఇంటర్ నేషనల్ ఎయిర్ పోర్టుకు చేరుకోటానికి కూడా చార్జీలు పెట్టుకోలేని పరిస్థితి,  పేర్ల శ్రీనివాసరావు, వర్రే రాంబాబు  దాతల ఆర్ధిక సాయంతో పాస్ పోర్ట్,  వీసా సమకూర్చుకున్నారు విజయవంతంగా జపాన్ దేశం వెళ్లి వచ్చారు.

జపాన్ దేశంలో పకృతి విపత్తులు సంభవించినప్పుడు భూకంపాలు, సునామీలు, తుపాన్లు వస్తే అక్కడి ప్రజలు అవలంబిస్తున్న పద్దతులు నేర్చుకుని తమ గ్రామంలో ఉన్న ప్రజలకు తెలియజేస్తున్నారు ఈ విద్యార్ధులు, తమ బిడ్డలు జపాన్ దేశం వెళ్లి వచ్చారని ఆనందం వ్యక్తం చేస్తున్నారు,  ప్రభుత్వ  పాఠశాలలలో చదివినా ఉన్నత స్థాయిలో రాణించవచ్చు చదువుకు పేదరికం అడ్డురాదని నిరూపించారు ఈ మట్టిలో మాణిక్యాలు .
 స్క్రిప్ట్ ftp ద్వారా పంపడమైనది
 వీడియోలు ఈటివి భారత్ మొబైల్ ద్వారా పంపడమైనది.
 
వాయిస్ బైట్స్
 కొమ్మినేని ఉదయ భాస్కర్ -   ఉపాధ్యాయుడు
 కొమ్మినేని ఉమామహేశ్వరరావు   -   ఉపాధ్యాయుడు
 విద్యార్ధులు 
 విద్యార్ధుల తల్లి తండ్రులు



Body:మట్టిలో మణిక్యాలు స్క్రిప్ట్


Conclusion:మట్టిలో మణిక్యాలు స్క్రిప్ట్

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.