ETV Bharat / state

GMC Meet: మురుగు కాలువలపై ఆక్రమణలు తొలగిస్తాం: మేయర్ - గుంటూరు నగరపాకల సంస్థ సమావేశం

గుంటూరు నగరపాలక సంస్థ సమావేశంలో మురుగు కాలువలపై ఆక్రమణలు, సెల్లార్లలో వాణిజ్య కార్యకలాపాలపై వాడీవేడి చర్చ జరిగింది. సమస్యపై అధికార, ప్రతిపక్ష కార్పొరేటర్ల మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది. సమస్య పరిష్కారానికి కార్పొరేషన్ తరఫున చర్యలు తీసుకుంటామని మేయర్ కావటి మనోహరనాయుడు స్పష్టం చేశారు.

guntur municipal corporation meeting over town issues
మురుగు కాలువలపై ఆక్రమణలు తొలగిస్తాం
author img

By

Published : Jul 5, 2021, 3:29 PM IST

మురుగు కాలువలపై ఆక్రమణలు తొలగిస్తాం

గుంటూరు నగరంలో మురుగు కాలువలపై ఆక్రమణలు, సెల్లార్లలో వాణిజ్య కార్యకలాపాలపై నగరపాలక సంస్థ సమావేశంలో వాడివేడి చర్చ జరిగింది. తెదేపా కార్పొరేటర్ వేములపల్లి శ్రీ రాంప్రసాద్ ఈ విషయాన్ని లేవనెత్తారు. అధికారులు ఈ విషయం గురించి వివరణ ఇవ్వాల్సి ఉండగా.. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా సమాధానం ఇచ్చేందుకు యత్నించారు. ఈ సందర్భంగా కాసేపు వాగ్వాదం జరిగింది. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ కూడా అక్రమణలకు ఎవరు పాల్పడినా తొలగించాలని డిమాండ్ చేశారు.

దాదాపు గంటపాటు ఈ అంశంపై వాదోపవాదనలు జరిగాయి. సమస్య పరిష్కారానికి కార్పొరేషన్ తరపున చర్యలు తీసుకుంటామని మేయర్ కావటి మనోహరనాయుడు స్పష్టం చేశారు. వాణిజ్య సముదాయాల్లోని సెల్లార్లు తప్పనిసరిగా పార్కింగ్ కోసమే వినియోగించాలన్నారు. ఇష్టానుసారంగా వ్యవహరించటం సరికాదని చెప్పారు. ఈ ఆదేశాలను ఉల్లంఘించిన వారికి నోటీసులు జారీ చేయాలని.. సరిగా స్పందించకపోతే అక్రమణలు తొలగించాలని అధికారులను ఆదేశించారు.

ఇదీ చదవండి:

ఏపీకి అన్యాయం జరుగుతోంది.. కేంద్ర మంత్రి ప్రకాశ్ జావడేకర్‌కు సీఎం జగన్ లేఖ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.