గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని ప్రజల వద్ద నుంచి వచ్చే సమస్యల పరిష్కారానికి.. సంబంధిత విభాగాధికారులు చర్యలు తీసుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా అనురాధ అన్నారు. నగరపాలక సంస్థలోని 103 ఫిర్యాదుల విభాగాన్ని ఆకస్మికంగా పరిశీలించిన ఆమె.. అపరిష్కృతంగా ఉన్న ఫిర్యాదులపై సిబ్బందికి పలు సూచనలు చేశారు.
పారిశుద్ధ్యం, తాగునీటిపై వచ్చే ఫిర్యాదులకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. కాల్‌సెంటర్‌కు వచ్చే ఫిర్యాదులపై నిర్లక్ష్యం వహిస్తే అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు.
ఇదీచదవండి.