ETV Bharat / state

రెడ్​జోన్లలో గుంటూరు ఎస్పీ పర్యటన

రెడ్​జోన్ ప్రాంతాలను గుంటూరు జిల్లా ఎస్పీ సీహెచ్ విజయారావు పరిశీలించారు. కరోనాపై స్థానికులకు అవగాహన కల్పించారు. మాస్కులు ధరిస్తూ.. భౌతిక దూరం పాటించాలని సూచించారు.

author img

By

Published : Jun 7, 2020, 10:27 AM IST

Guntur district SP ch. vijayarao visitted in corona Red Zones Bethani Colony, Narashettivaripalem

గుంటూరు జిల్లా బాపట్ల ప్రాంతంలో కొవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదైన బేతని కాలనీ, నరాలశెట్టివారిపాలెం ప్రాంతాలను జిల్లా ఎస్పీ విజయారావు పరిశీలించారు. గుంటూరు జిల్లా రూరల్ పరిధిలో కరోనా కేసులు పెరుగుతున్నాయని... నరసరావుపేటలోనే అత్యధిక కేసులు నమోదయ్యాయని ఆయన వెల్లడించారు.

పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్న ప్రాంతాల్లో.... ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్​లో ఉన్న వాళ్లకు వైరస్ నిర్ధరణ పరీక్షలు చేస్తున్నామని ఎస్పీ తెలిపారు. అనవసరంగా ఎవరూ బయటకి రావొద్దని స్థానికులను హెచ్చరించారు. మాస్కులు ధరిస్తూ, భౌతిక దూరం పాటించాలని ఎస్పీ సూచించారు.

ఇదీ చదవండి: గుంటూరు నుంచి స్వస్థలాలకు వలస కూలీలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.