కరోనా రాకుండా ఉండాలంటే స్వీయ రక్షణే ముఖ్యమని గుంటూరు జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ అన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు ఎలాంటి కరోనా కేసులు నమోదు కాలేదని.. అయినప్పటికీ ముందస్తు చర్యలు చేపట్టామన్నారు. నెలాఖరు వరకు పాఠశాలలు, కళాశాలలు, వసతిగృహాలను మూసివేయాలని ఆదేశించారు. రాజధానిలో ఆందోళన చేస్తున్న వారి కోసం వైద్య బృందాన్ని పంపించామని... ఆందోళనకారులు కరోనా వైరస్ పూర్తిగా తగ్గే వరకు ఆందోళనలు వదిలి ఇంటివద్దనే ఉండాలన్నారు. ఫిలిప్పీన్స్ నుంచి 20 మంది విద్యార్థులు వచ్చారని వారిని ఇంటివద్దనే ఉండేలా సూచించామని... అందుకుగాను ఏఎన్‌ఎం, ఆశావర్కర్ల ద్వారా పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. గుంటూరు జిల్లాలో థియేటర్లు, కల్యాణ మండపాలు, స్టేడియంలను మూసివేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.
ఇవీ చదవండి...రాష్ట్రంలో మూడుకు చేరిన కరోనా కేసుల సంఖ్య